ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మరోసారి సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అభివృద్ధి కార్యక్రామాలు, ఓట్లకు లింకు పెట్టిన ఆయన.. అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓట్లు రావని.. వాటిని లైట్‌గా తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి కాల్వల్లో పూడిక కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు.. పంట కాల్వల, డ్రెయిన్ల నిర్వహణ ఒక నిరంతర ప్రక్రియలా సాగాలని.. గత ప్రభుత్వం గానీ ఈ ప్రభుత్వం గానీ పూడికతీత అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. పొలాల నుంచి డ్రెయిన్లలో…
గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు వాసి వెంకాయమ్మ కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి లేఖ రాశారు. ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై వైసీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో పరిపాటిగా మారాయని లేఖలో చంద్రబాబు ఆరోపించారు. దాడులు, దూషణలు, బెదిరింపులు, హత్యల ద్వారా తమను విమర్శించేవాళ్లను వైసీపీ భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. కొందరు పోలీసు అధికారుల సహకారంతో ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. ప్రభుత్వాన్ని విమర్శించారంటూ గత నెల…
ఏపీ ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూర్చే దిశగా రవాణాశాఖ కసరత్తు ప్రారంభించింది. వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గణనీయంగా పెంచుతూ గురువారం రాత్రి రవాణా శాఖ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్ ఫీజును గరిష్టంగా రూ. 2 లక్షలు, కనిష్టంగా రూ. 5 వేల వరకు రవాణా శాఖ ప్రతిపాదించింది. పెంపు కారణంగా ఏడాది కాలానికి రూ. 100 కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 9999…
అమరావతిలో 219వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022–23 వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్‌బీసీ వెల్లడించింది. ఇందులో 51.56 శాతం వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించినట్లు ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. కాగా 2021-22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం జగన్…
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. విద్యా శాఖలోకి మున్సిపల్ స్కూళ్ల విలీనం ప్రభుత్వ కుట్ర అని మండిపడ్డారు. ఏపీలో 2,115 పురపాలక పాఠశాలలకు చెందిన వేల కోట్ల ఆస్తుల కోసమే విలీన ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన స్వార్థం కోసం నాలుగున్నర లక్షల విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడతారా అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ స్కూళ్ల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. విలీన…
సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో అమ్మే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, కార్పొరేషన్ ఆన్‌లైన్ టికెటింగ్ పోర్టల్ కోసం సర్వీస్ ప్రొవైడర్‌ను నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లు ఎ.పి.ఎఫ్డిసితో ఒప్పందం చేసుకోవాలని, ప్రొవైడర్ గేట్‌వే ద్వారా మాత్రమే సినిమా టిక్కెట్లను విక్రయించాలని ప్రభుత్వం చెబుతోంది. ఈ పోర్టల్ సినిమా విడుదలకు ముందే బుకింగ్ స్లాట్లను నిర్వహించనుంది. రిలీజ్ కి ఒక వారం ముందు థియేటర్లు…
కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్(APREI) సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల జీతాలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరికి రివైజ్డ్ పేస్కేల్ ప్రకారం మినిమం టైమ్‌స్కేల్‌ను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీవో నెం.40 వర్తింపజేస్తూ సొసైటీ కార్యదర్శి ఆర్ నరసింహరావు మెమో జారీ చేశారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు…
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ఇకపై ప్రతి టికెట్‌పైనా 2 శాతం కమీషన్ వసూలు చేయనుంది. ఏపీ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో.. ఇక నుంచి రాష్ట్రంలోని ఏ మూలన సినిమా చూడాలన్నా ఈ పోర్టల్ ద్వారానే టికెట్లను కొనుగోలు చేయాల్సిందే. ప్రైవేటు…
ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. జూన్ నెలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బుధవారం నాడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ప్రకటించారు. జూన్ 7న రైతన్నలకు 3,800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 14న రైతులకు పంటల బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. జూన్ 23న అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తామని జగన్ తెలిపారు. YSRCP: వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ.. భారీ ఎత్తున…
ఏపీ జెన్కో థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో టీడీపీ, సీపీఎం, సీపీఐ, కార్మిక సంఘాల నేతల సమావేశం జరిగింది. ఈ మేరకు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, మోహన్ రావు, అంకయ్య, రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు…