CM Chandrababu: మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు ( జనవరి 12న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఇక, ఈ కార్యక్రమానికి జిల్లాల కలెక్టర్లు వర్చువల్గా హాజరు కానున్నారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సచివాలయంలోని ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో సమావేశం జరగనుంది.
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై రేపు సుప్రీం కోర్టులో జరగనున్న కీలక విచారణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదనలను అత్యంత బలంగా వినిపించేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి న్యాయస్థానంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులు , లీగల్ టీంతో సుదీర్ఘమైన సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ సాయిప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహామూర్తితో పాటు ఇంటర్ స్టేట్…
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఇవాళ ( జనవరి8న) జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించబోతున్నారు. సీఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపాలిటీలు, పట్టణాలు మరియు నగరాల్లోని వార్డు సచివాలయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వీటిని ‘వార్డు సచివాలయం’ అని కాకుండా ‘స్వర్ణ వార్డు’గా పిలవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు వార్డు సచివాలయాల పేరును స్వర్ణ వార్డులుగా మార్చే ప్రతిపాదనకు కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పేరు మార్పుకు సంబంధించి…
Transfers : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పరిపాలన విభాగంలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న 11 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ, వారికి కొత్త పోస్టింగ్లు కల్పిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల ప్రకారం, పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ బాధ్యతలను డి.…
Off The Record: విశాఖలో గూగుల్కు భూ కేటాయింపు కొత్త మలుపు తిరగబోతోందా? అస్సలు ఊహించని అభ్యంతరాలు తెర మీదికి వస్తున్నాయా? మేటర్ మతం రంగు పులుముకుంటోందా? ఊ... అంటే ఏమవుతుందో, ఉహూ... అంటే ఏమవుతుందో అర్ధంగాక బీజేపీ తల బాదుకుంటోందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్కు ఎదురవుతున్న కొత్త అడ్డంకులేంటి? దాంతో కాషాయ దళానికున్న సంబంధం ఏంటి?
Minister Dola Bala Veeranjaneya Swamy: విశాఖపట్నం అంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని వెల్లడించారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ఉత్తరాంధ్రను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు విస్తరించిన తొమ్మిది జిల్లాలను కలుపుకుని “విశాఖ ఎకనామిక్ రీజియన్”ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. ఈ ఎకనామిక్ రీజియన్ ద్వారా పరిశ్రమలు, ఉపాధి…
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులకి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఫైల్ క్లియరెన్స్ లో ఆరు రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అని సూచించారు.
AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ( డిసెంబర్ 11న) ఉదయం 11 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అజెండాలోని పలు కీలక అంశాలపై చర్చించి అనంతరం ఆమోదం తెలపనున్నారు.
CM Chandrababu: ఇవాళ (డిసెంబర్ 10న) సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు హెచ్ఓడీల సమావేశం జరగనుంది. ఉదయం 10: 30 గంటల నుంచి మధ్యాహ్నం 1: 45 గంటల వరకూ మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించనున్నారు.