Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ సీఎం…
Andhra Pradesh: గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా నోటిఫై చేస్తున్నామని.. శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్‌లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్‌ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్‌సీ,…
Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్‌పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న…
Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు…
Dwakra Products Sales in Amazon: ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు అమెజాన్, సెర్ప్ ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరింది. అమెజాన్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు దాదాపు 6 వేల రకాల ఉత్పత్తులను…
Pawan Kalyan Key Comments in independence day Celebrations: పదవులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. తాను పదవే కావాలని కోరుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి,…
MPDO Association leaders meets cm jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా, డీడీవోలుగా ఒకేసారి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాకర్ల వెంకటరామిరెడ్డి, ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడు వై.బ్రహ్మయ్య ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి…
Andhra Pradesh: ఏపీలో విద్యార్థులకు విద్యాశాఖ కీలక సూచన చేసింది. ఆగస్టు 13న వర్కింగ్ డేగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13న రెండో శనివారం సెలవును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు స్కూళ్లలో డ్యాన్స్, మ్యూజిక్, ర్యాలీలు, పెయింటింగ్, గ్రూప్ డిస్కషన్స్, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్లోడ్ చేయడం…