Supreme Court: రెండు వారాల్లో ఆ నిధులు వెనక్కి ఇవ్వండి.. ఏపీ సర్కార్‌కు సుప్రీం ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నిధులు పక్కదారి పట్టించిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.. పీడీ ఖాతాలకు మళ్లించిన ఎస్డీఆర్ఎఫ్ నిధులను వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది.. రెండు వారాల్లోగా ఆ నిధులు తిరిగివ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.. పీడీ ఖాతాలకు మళ్లించిన నిధులను తిరిగి రెండు వారాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలో జమ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది జస్టిస్ ఎం.ఆర్ షా ధర్మాసనం.. అయితే, నిధులు వెనక్కి ఇవ్వడంపై ప్రభుత్వ అభిప్రాయం తీసుకుంటామని న్యాయవాది కోరగా.. అవసరం లేదని స్పష్టంచేసింది సుప్రీంకోర్టు… దీనిపై తామే ఉత్తర్వులు ఇస్తామని వ్యాఖ్యానించింది.. కాగా, కొన్ని కోవిడ్ బాధిత కుటుంబాలకు పరిహారం ఇంకా అందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో, పరిష్కార కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది సుప్రీం… వచ్చిన ఫిర్యాదులను 4 వారాల్లోగా పరిష్కరించాలని కమిటీని ఆదేశించింది. పీడీ ఖాతాల్లోకి మళ్లించిన సుమారు 11 వందల కోట్లు చెల్లించాలని.. ఎస్డీఆర్ఎఫ్ ఖాతాలోకి జమ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Read Also: GST Rate Hike: ఇక వీటిపై జీఎస్టీ బాదుడు షురూ..
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!