Chandra Babu: నాలుగంటే నాలుగే.. ఇదేనా జగన్ సర్కార్ వరద సాయం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tdp cheif chandrababu comments on helping to Flood victims: గోదావరి నదికి వచ్చిన వరద ప్రజలను అతలాకుతలం చేసింది. ఈ వరద కారణంగా పోలవరం ముంపు గ్రామాల ప్రజల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం చేస్తున్న వరద సాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రీతిలో సెటైర్లు వేశారు. నాలుగు ఉల్లిపాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళాదుంపలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు. నాలుగంటే నాలుగే.. ఇది జగన్ సర్కార్ వరద సాయం అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు.
నాలుగంటే నాలుగే! ఇది జగన్ సర్కార్ వరద సాయం.
Also Read
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
నాలుగు ఉల్లి పాయలు, నాలుగు టమాటాలు, నాలుగు బంగాళా దుంపలు!
ఇదీ గోదావరి వరద బాధితులకు మీ ప్రభుత్వం ఇచ్చిన సాయం….లెక్క చూసుకో జగన్ రెడ్డి… నాలుగంటే నాలుగే!#APFloods2022 pic.twitter.com/WqzEu1BIiy
— N Chandrababu Naidu (@ncbn) July 19, 2022
కాగా ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేస్తే సరిపోతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పీకల్లోతు వరదల్లో ప్రజలు మునిగి ఉంటే జగన్ తన కాలికి బురద అంటకుండా హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సీఎం జగన్ గాల్లో తిరిగితే ప్రజల వరద ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20, 21, 22 తేదీల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
Read Also: Pawan Kalyan: బటన్ నొక్కితే సరిపోదు.. మానవత్వంతో స్పందించాలి
మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వ సాయంపై టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు కూడా ఆరోపణలు చేశారు. గోదావరి వరదల్లో చిక్కుకున్నవారికి సాయం అందించలేకే ప్రభుత్వం పోలవరం ఎత్తు అంశంపై డ్రామాలు ఆడుతోందని విమర్శించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే పోలవరం ఎత్తుపై తెలంగాణ మిత్రులతో కలిసి కొత్త ఏపీ మంత్రులు కొత్త నాటకానికి తెరలేపారన్నారు. టీడీపీ హయాంలో లేని పోలవరం ఎత్తుపై రగడ జగన్ ప్రభుత్వంలోనే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పోలవరం ఎత్తుపై కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కనీసం స్పందించని ఏపీ మంత్రులు ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని నిలదీశారు. కేంద్ర జలశక్తి పరిధిలో అంశాలపై ఏపీ, తెలంగాణ నేతలు స్పందించడానికి కారణం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే అని నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.
తాజావార్తలు
-
AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
-
New Mahindra Thar OG: కొత్త Mahindra Thar OG భారత్‌లో లాంచ్.. 2.2L డీజిల్, 2.0L టర్బో పెట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
ట్రెండింగ్
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..