Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బుధవారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం…
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానులు రెఫరెండంగా వచ్చే ఎన్నికలకు వెళ్లామంటున్న వైసీపీ ప్రభుత్వం.. దమ్ముంటే ఇప్పుడే అసెంబ్లీని రద్దు చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో డిమాండ్ చేయాలని టీడీఎల్పీలో నిర్ణయించారు. జగన్‌కు అంత నమ్మకం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ సవాల్ విసిరింది. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉపనేత నిమ్మల రామానాయుడు…
Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని..…
గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే.. వైసీపీ సర్కార్.. రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.. ఆ దిశగా అడుగులు వేస్తోంది.. అయితే, ఏపీ లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా మారనున్న అమరావతిని.. మున్సిపాలిటీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. 22 గ్రామపంచాయతీలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయసేందుకు సిద్ధమైంది.. తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్టు సమాచారం.. ఈ మేరకు, గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ…
Botsa Satyanarayana: సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులతో సీపీఎస్ అంశంపై చర్చలు ముగిసిన తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. జీపీఎస్‌లో అనేక ప్రయోజనాలు చేర్చామని.. గతంలో చెప్పిన దాని కంటే జీపీఎస్‌ను మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. జీపీఎస్‌కు చట్టబద్దత కల్పిస్తున్నామని.. కనీసం రూ.10 వేల నుంచి గ్యారెంటీ పెన్షన్ వస్తుందని వెల్లడించారు. ఉద్యోగితో పాటు స్పౌస్‌కి కూడా హెల్త్ కార్డు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి ఎంత మేరకు అవకాశం ఉంటే…
Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీసీఎస్‌పై ఉద్యోగులు ఆలోచించుకోవాలని కోరారు. ఉద్యోగులకు మరింత భద్రత కల్పిస్తామని.. ప్రభుత్వం చేసిన కొన్ని ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలకు వివరించామని తెలిపారు. సీపీఎస్ అంశంపై అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ఒక కమిటీ వేశారని.. ఓపీఎస్ వల్ల జరిగే భవిష్యత్తులో ఆర్ధికపరంగా విపత్తు వచ్చే అవకాశం ఉందని సజ్జల వివరించారు.…
Vijayawada: ఏపీలో అగ్రిగోల్డ్ బాధితులు మరోసారి రోడ్డెక్కారు. ఈ మేరకు విజయవాడలో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ధర్నా చౌక్‌కు తరలివచ్చారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కస్టమర్లు, ఏజెంట్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆక్రందన సభ చేపట్టారు. అధికారంలోకి వచ్చిన వారంలో న్యాయం చేస్తామని చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు స్పందించడంలేదంటూ అగ్రిగోల్డ్ బాధితులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్…
Archana Gautham: సినీ నటి అర్చనా గౌతమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో రచ్చ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఆమె తాజాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్ళింది.
Pothula Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన నారా చంద్రబాబు నాయుడు కాదని.. సారా చంద్రబాబు నాయుడు అంటూ వ్యాఖ్యానించారు. బీ3 అంటే భువనేశ్వరి, బ్రాహ్మణి, బాబు అని.. అయ్యన్న పాత్రుడు వంటి అనేక మంది నాయకుల ద్వారా భువనేశ్వరి, బ్రాహ్మణ మద్యం వ్యాపారం చేయిస్తున్నారని.. వాళ్లకు మద్యం నుంచి రోజుకు వచ్చే ఆదాయం రోజుకు కోటి రూపాయలు ఉంటుందని ఆరోపించారు. నారా…