Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం రివార్డు.. రూ.50 లక్షలు అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఔత్సాహిక వ్యోమగామి దంగేటి జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది. వ్యోమగామి కావాలన్న జాహ్నవి కల సాకారం అయ్యే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రూ.50 లక్షల చెక్కును జాహ్నవికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు బుధవారం మధ్యాహ్నం క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. తన కల సాకారం అయ్యే దిశగా ఈ మేర ఆర్థిక సాయం చేసిన సీఎం జగన్‌కు జాహ్నవి కృతజ్ఞతలు తెలిపారు. వ్యోమగామికి వెళ్లాలని తన కోరిక అని.. తన కల నెరవేరదేమోనని అనుకుంటున్న సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణును కలిశానని.. మంత్రి వేణు చొరవతో తనకు ఆర్ధిక సాయం చేసేందుకు సీఎం జగన్ అంగీకరించారని.. ఆయన చేసిన ఆర్ధిక సాయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటానని జాహ్నవి తెలిపింది.
Read Also: Alcohol Effects: ఆల్కాహాల్ వల్ల కాలేయమే కాదు.. ఇవి కూడా దెబ్బతింటాయి.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
వ్యోమగామిగా వెళ్లాలనే జహ్నావి అనే పేద బాలికకు సీఎం జగన్ ఆర్ధిక సాయమందించారని మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడించారు. వ్యోమగామి కావాలంటే ఇంటర్నేషనల్ పైలెట్ ట్రైనింగ్ కోర్సు చేయాల్సి ఉందని.. ఆ పైలెట్ ట్రైనింగ్ కోర్సు నిమిత్తం రూ. 50 లక్షలు అందించారని తెలిపారు. పేదల కలలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన జాహ్నవి ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతోంది. ఓ వైపు ఇంజినీరింగ్ చదువుతూనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయురాలిగానే కాకుండా తొలి ఆసియా ఖండ వాసిగా కూడా జాహ్నవి రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో తాను వ్యోమగామి కావాలన్న సంకల్పంతో సాగుతున్న జాహ్నవికి ఏపీ ప్రభుత్వం భారీ ప్రోత్సాహకం అందించింది.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!