ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది… దాదాపు 20 ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిస్తూ.. భారీ ఎత్తున కొత్త పోస్టులకు క్రియేట్ చేసింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం… కొత్తగా భారీ స్థాయిలో ఎంఈవో పోస్టులను క్రియేట్ చేసింది ఏపీ ఏపీ సర్కార్… ఎంఈవో-2 పేరుతో కొత్త పోస్టులు సృష్టించారు… దీని ప్రకారం.. ఇకపై ప్రతీ మండలంలోనూ ఇద్దరు ఎంఈవోలు ఉండనున్నారు… కొత్తగా 679 ఎంఈవో-2 పోస్టులను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రభుత్వం… ఇక, మరో 13 ఎంఈవో-1 పోస్టుల ఏర్పాటుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది…. అకాడెమిక్, నాన్ అకడెమిక్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఎంఈవో-2 పోస్టులు సృష్టించింది ప్రభుత్వం… ఏకీకృత సర్వీస్ రూల్స్ అంశం సుప్రీం కోర్టులో పెండింగులో ఉండడం వల్ల చాలా కాలంగా ప్రమోషన్లు నిలిచిపోయాయి.. అయితే, కొత్త పోస్టుల సృష్టితో సుమారు 20 ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.
Read Also: PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ