Vangalapudi Anitha: ఇటీవల విశాఖ పర్యటనలో సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. విశాఖ నుంచే ఈ నిషేధం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. అయితే ప్లాస్టిక్ నిషేధంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా సినిమా…
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కొత్తగా ఫైల్ జంపింగ్ విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం… ఫైళ్ల క్లియరెన్సులో జాప్యం లేకుండా ఉండేందుకు ఫైల్ జంపింగ్ విధానాన్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ సర్కార్… ఈ మేరకు ఏపీ సెక్రటేరియట్ ఆఫీస్ మాన్యువల్ బిజినెస్ నిబంధనల్ని సవరణకు ఆమోదం తెలిపారు.. జీఏడీ ఇచ్చిన నోట్ ఆధారంగా సచివాలయ మాన్యువల్‌లో మార్పు చేర్పులు చేశారు.. సచివాలయంలో అనసవరమైన స్థాయిల్లో ఫైళ్లను తనిఖీ చేయటం అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.. సహాయ…
GVL Narasimha Rao: తెలుగు రాష్ట్రాలలో స్కాంలు జరుగుతున్నాయని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయని.. ఈ స్కాం ద్వారా అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూరిందనే ప్రచారం జరుగుతోందని జీవీఎల్ వ్యాఖ్యానించారు. గ్రేట్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలన్నారు. అటు ఏపీలో లేపాక్షి భూముల వ్యవహారం పెద్ద ల్యాండ్…
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
Chandrababu: గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన వైసీపీ నేత గుదిబండ గోవర్ధన్‌రెడ్డి తన అనుచరులతో పాటు టీడీపీలో చేరారు. దుగ్గిరాల మాజీ ఎమ్మెల్యే వెంకటరెడ్డి సోదరుడి కుమారుడే గోవర్ధన్ రెడ్డి. పదేళ్ల పాటు వైసీపీలో కొనసాగిన ఆయన తాజాగా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్ మళ్లీ సీఎం…
Andhra Pradesh: గ్రామాల్లోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 10,032 గ్రామ సచివాలయాలను YSR హెల్త్ క్లినిక్‌లుగా నోటిఫై చేస్తున్నామని.. శిక్షణ పొందిన సిబ్బందిని ఈ క్లినిక్‌లలో నియమిస్తామంది. ఇప్పటికే 8,500 మంది గ్రాడ్యుయేట్లను ఎంపిక చేశామని.. హెల్త్ క్లినిక్‌ల కోసం 8500 భవనాలు నిర్మిస్తున్నట్లు, 14 రకాల వైద్య పరీక్షలు గ్రామస్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామంది. ఈ మేరకు గ్రామ స్థాయిలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ మొదలు పీహెచ్సీ,…
Kodali Nani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లక్ష కోట్లు అవినీతికి పాల్పడ్డాడని జగన్‌పై చంద్రబాబు ఎంత ప్రచారం చేసినా ప్రజలు నమ్మకుండా అధికారాన్ని కట్టబెట్టారని.. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పప్పు నాయుడు చంద్రబాబు అని కొడాలి నాని ఆరోపించారు. అటు పప్పు నాయుడు కుమారుడు తుప్పు నాయుడు మంగళవారం మాటలు మాట్లాడుతున్నాడని.. వారంలో ఏదో జగన్ వ్యవహారం బయటపెడతానని వాగుతున్నాడని.. అదేదో మొన్న…
Gudivada Amarnath: అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అసలు సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ నుండి జనసేన పార్టీకి స్వతంత్రం వచ్చిందా అని పవన్ కళ్యాణ్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో తెలుగుదేశం పార్టీ నుంచి స్వతంత్రం కోసం జనసైనికులు…
Dwakra Products Sales in Amazon: ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులు త్వరలో అమెజాన్ ద్వారా డిజిటల్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రత్యేక బ్రాండింగ్ ద్వారా అమెజాన్‌లో విక్రయించనున్నారు. ఈ మేరకు అమెజాన్, సెర్ప్ ప్రతినిధుల మధ్య అంగీకారం కుదిరింది. అమెజాన్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు దాదాపు 6 వేల రకాల ఉత్పత్తులను…