ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన..…
Pawan Kalyan: కడప జిల్లా చాపాడు మండలం చియ్యపాడులో ముగ్గురు రైతులు విద్యుత్ షాక్‌తో మరణించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్‌తో రైతులు దుర్మరణం చెందడం దురదృష్టకరమన్నారు. పంటను కాపాడుకునేందుకు పురుగుల మందు పిచికారీ చేయడానికి వెళ్లిన ముగ్గురు రైతులు విద్యుత్…
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు,…
R Krishnnaiah: విజయవాడలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల పాటు బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. కానీ ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కానీ ఏపీ సీఎం జగన్ బీసీ కాకపోయినా బీసీల పక్షపాతిగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అందుకే సీఎం జగన్‌ను సంఘ సంస్కర్తగా పరిగణించాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించిన నాయకుడు వైఎస్…
Comedian Ali: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో ఎప్పటినుంచో యాక్టివ్ గా ఉంటున్న కమెడియన్ ఆలీకి కీలక పదవిని అందించారు.
Pawan Kalyan: విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో జైలు నుంచి 9 మంది జనసేన నాయకులు విడుదల కావడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖపట్నంలో పాలకపక్షం బనాయించిన అక్రమ కేసుల వల్ల జైలుపాలైన తొమ్మిది మంది నేతలు ఈరోజు బెయిల్ మీద బయటకు రావడం సంతోషించదగ్గ పరిణామం అని పవన్ పేర్కొన్నారు. జనసేన నేతలు జైలులో ఉన్న సమయంలో వారి కుటుంబ సభ్యులు ఎంత ఆందోళనకు గురయ్యారో తనకు తెలుసన్నారు. జైలులో ఉన్న…
Sajjala Ramakrishna Reddy: వికేంద్రీకరణపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు అభ్యంతరాలు దాటి ఈ ఏడాదిలోనే విశాఖలో పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు. ఎంత త్వరగా సాధ్యమైతే అంత త్వరగా వైజాగ్ నుండి పరిపాలన ప్రారంభిస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్ వైపు రాకూడదనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విడివిడిగా పోటీ చేశారని.. ఇప్పుడు ఎన్నికలు…
Andhra Pradesh: ఏపీలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల ఉపకార వేతనం (స్టైఫండ్) పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ జీవో జారీ చేసింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ.44వేల నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46వేల నుంచి రూ.53 వేలకు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు, ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. వివిధ క్యాటగిరీలు, చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్లో పెంపుదల ఉంటుందని…
YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజుకు సెక్యూరిటీని పెంచుతూ ఏపీ ప్రభుత్వం భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. ఈ మేరకు అదనంగా నలుగురు పోలీసులను ప్రభుత్వం నియమించింది. ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజును హెచ్చరిస్తూ మావోయిస్టుల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు నలుగురు పోలీసులను కేటాయిస్తు రాష్ట్ర పోలీసు శాఖ భద్రతా పరమైన చర్యలు తీసుకుంది. Read Also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని…
వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయంలో కొన్ని రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాలు బిగించేపనిలో ఉన్నాయి.. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని నిర్ణయాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న ఇంధన శాఖ.. ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. ఇళ్లల్లోని కరెంట్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలని నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగ కనెక్షన్లకే కాకుండా.. పరిశ్రమలు, వాణిజ్య, ప్రభుత్వానికి సంబంధించి ఉన్న విద్యుత్…