టీటీడీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇవాళ ఉదయం 11.44 గంటలకు గరుడాళ్వార్ సన్నిధిలో టీడీడీ ఛైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఛైర్మన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు భూమన కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో సామాన్య భక్తుడే నా మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థాన కొత్త ఛైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినందుకు భక్తులకు అండగా ఉంటానని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ధనవంతులుకు ఉడిగం చెయ్యడానికో.. వారికి ప్రాధాన్యత ఇవ్వడానికో ఈ పదవి చెప్పట్ట లేదు అని ఆయన వ్యాఖ్యనించారు. హింధు ధార్మికతను పెంపోందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. దేవుడిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడం కాదు.. స్వామివారు భక్తుడిని అనుగ్రహించే క్షణకాల దర్శనం లభిస్తే చాలు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.
Read Also: Purandeshwari: పంచాయతీల్లో నిధులు లేక సర్పంచ్ లు ఆత్మహత్యలు
టీటీడీ చైర్మన్ గా పెద్దలకు విజ్ఞప్తి చేస్తూన్నాను.. ఎక్కువ సమయం స్వామివారిని దర్శించుకోవాలన్నా కోరిక సమంజసం కాదు అని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కోట్లాది మంది ఆశించే టీటీడీ ఛైర్మన్ పదవిని ఆశిస్తూ ఉంటే.. సామాన్య భక్తుడినైన నన్ను స్వామివారు అనుగ్రహించారు అని ఆయన వెల్లడించారు. గతంలో నాలుగు సంవత్సరాలు పాలకమండలి సభ్యుడిగా వున్నా.. నాలుగు సార్లు కూడా వీఐపీ బ్రేక్ దర్శనానికి వెళ్లలేదు.. సామాన్య భక్తుడిలాగే స్వామివారిని మహలఘు విధానంలో అనేక సార్లు దర్శించుకున్నాను అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.
Read Also: 7/G Brundavan Colony : రీ రిలీజ్ కు సిద్దమైన కల్ట్ క్లాసిక్ మూవీ..?
సామాన్య భక్తులకు దర్శనం చెయ్యించడమే కాదు.. భక్తులు దగ్గరకే ఆధ్యాత్మిక కార్యక్రమాలను తీసుకువెళ్తామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చిన్న సమస్య కూడా లేకూండా రోజుకి 85 వేల మంది భక్తులకు దర్శనం చేయిస్తున్న.. ఆలయం తిరుమలే అని అన్నారు. నేను దర్శనాలు చేసుకోవడానికి.. దర్శనాలు చెయ్యించడానికి అయిన అధ్యక్షుడిని కాదు.. సామాన్య భక్తులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.