SIM Cards: ఏంటి మావా ఇన్ని వాడేవా!.. 658 సిమ్ కార్డులు ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఒక్క సిమ్ కార్డు తీసుకునేందుకు నానా తిప్పలు పడుతుంటే ఓ వ్యక్తి ఏకంగా వందల సంఖ్యలో సిమ్ కార్డ్స్ తీసుకుని వాడుతున్నాడు. ఎక్కడో కాదండోయ్ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని గుణదలలో ఒకే ఫొటోతో ఏకంగా 658 సిమ్‌కార్డులు ఉన్నట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్ అధికారులు విజయవాడ సీపీ కాంతిరాణాకు ఫిర్యాదు చేశారు. ఇక, సూర్యారావుపేట పోలీసులకు సీపీ కాంతిరాణా విచారణ చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఫొటోతో ఓ నెట్‌వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్‌లను అమ్మినట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Cheddi Gang: మళ్ళీ వచ్చేసారు జాగ్రత్త.. సంగారెడ్డిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
- AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
అయితే, సత్యనారాయణపురానికి చెందిన నవీన్ అనే యువకుడు ఈ సిమ్ కార్డులని రిజిస్టర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇదే తరహాలో అజిత్‌సింగ్‌నగర్, విస్సన్నపేట పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో 150 వరకు నకలి పత్రాలతో సిమ్‌కార్డులు అమ్మినట్లు గుర్తించారు. సిమ్ కార్డుల మోసాలను అరికట్టేందుకు టెలికమ్యునికేషన్ల శాఖ ప్రత్యేకంగా ఓ వ్యవస్థను తీసుకొచ్చింది.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఓ టూల్ కిట్ ద్వారా ఈ మోసం బయటపడింది. ఒకే ఫొటోతో జారీ అయిన ఈ సిమ్‌కార్డులు ఎక్కడికి వెళ్లాయి? వాటిని ఎవరు, ఎందుకోసం ఉపయోగిస్తున్నారన్న దానిపై పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.
Read Also: 498 BSNL Prepaid Plan: బీఎస్‌ఎన్‌ఎల్ సూపర్ రీఛార్జ్ ప్లాన్.. రూ. 498తో 6 నెలల వ్యాలిడిటీ!
ఏఎస్‌టీఆర్ సాఫ్ట్‌వేర్ ద్వారా సిమ్‌కార్డు మోసాలను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్ గుర్తించి.. సంబంధిత నంబర్లను బ్లాక్ చేస్తున్నారు. అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్‌కార్డుదారుల ఫోటోలను తీసుకుని ఫిల్టర్ చేస్తున్నారు. నకిలీ పత్రాలతో జారీ చేసిన సిమ్‌కార్డులు అసాంఘిక శక్తుల చేతుల్లో పడితే పరిస్థితి వేరేగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. సిమ్ కార్డులపై డాట్ పరిమితి విధించింది. ఒక వినియోగదారుడి పేరు మీద 9 కన్నా ఎక్కువ సిమ్ కార్డులుంటే మళ్లీ వెరిఫికేషన్ చేసుకోవాలని ఆదేశించింది. ఒకవేళ అలా చేసుకోని వారి అదనపు కనెక్షన్లు డీ యాక్టివేట్ చేయాలని టెలికాం ఆపరేటర్లకు డాట్ ఆదేశించింది.
తాజావార్తలు
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Nissan Pixo: నిస్సాన్ పిక్సో విడుదల.. 259KM రేంజ్, 10-అంగుళాల డిస్‌ప్లే, Gemini వాయిస్ అసిస్టెంట్.. ఫీచర్లు ఇవే
-
Anakapalli: వర్షాల వేళ విషాదం.. తల్లీకూతుళ్లను బలిగొన్న విద్యుత్ వైరు
-
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!