టీడీపీ పెత్తందార్ల వైపు.. మేము పేదల వైపు ఉన్నామని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్ళు ఇస్తామంటే మోకాలడ్డి చంద్రబాబు శునకానందం పొందుతున్నాడు. అమరావతి మీ అడ్డా కాదు.. మా బిడ్డలు ఉంటారు.. ఈ యుద్ధంలో మేం కచ్చితంగా గెలిచి తీరుతామని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ను అడ్డు పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడు.. పుంగనూరులో కొంచెం తోపులాట జరిగింది.. దీన్ని చంద్రబాబు పెద్దది చేసి చూపించాడు.. ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు రౌడీలా మాట్లాడాడు అని ఎంపీ నందిగాం సురేష్ విమర్శించాడు.
Read Also: Earthquake: బంగాళాఖాతంలో 4.4 తీవ్రతతో భూకంపం
ఒక వెధవని సీఐ అంజూ యాదవ్ కొట్టారని పవన్ కళ్యాణ్ నానా హడావిడి చేశాడు అని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. మరి టీడీపీ కార్యకర్తలు 40 మంది పోలీసులపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదు.. అధికారాన్ని లాక్కోవాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు?.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ రాష్ట్రం అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Rishabh Pant: 140 స్పీడ్ బాల్స్ను ఎదుర్కొంటున్న రిషబ్.. వరల్డ్ కప్లో ఆడేనా..!
రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని ఎంపీ నందిగాం సురేష్ తెలిపారు. చంద్రబాబుకు అమరావతి పైనే ప్రేమ.. పులివెందుల వెళ్ళి అమరావతి గురించి మాట్లాడుతున్నాడు.. ఈ వయస్సులో ఇలా మాట్లాడటానికి సిగ్గు ఉందా?.. ప్రజలు ఓటు అనే ఆయుధంతో వీరి శిరచ్ఛేదం చేయనున్నారు.. 2024 తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా పనికి రాకుండా పోతాడు.. చంద్రబాబు లాంటి వ్యక్తి సమాజానికే ప్రమాదం అని ఎంపీ నందిగాం సురేష్ వెల్లడించారు.