ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తలపెట్టిన మహాధర్మలో ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. ఒంగోలు కలెక్టరేట్ దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు అని ఆమె విమర్శించారు. పంచాయతీల్లో నిధులు లేక అప్పులు చేసి సర్పంచ్ లు పని చేస్తున్నారు.. సర్పంచ్ లకు నిధులు రాకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్న పాపం ఈ ప్రభుత్వానిదే అంటూ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ ఆత్మహత్య ల పాపం జగన్మోహన్ రెడ్డి ది కాదా.. రాజ్యాంగ బద్దమైన సర్పంచ్ వ్యవస్థని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది అని విమర్శలు గుప్పించారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చే నిధులను జగన్ సర్కార్ పక్కదారి పట్టిస్తుందని ఏపీ బీజేపీ అధక్షురాలు ఆరోపించారు.
Read Also: Rice Price Hike: ఆసియాలో 15 ఏళ్ల రికార్డు బ్రేక్.. మండిపోతున్న బియ్యం ధర..
సర్పంచ్ లకు అన్యాయం చేస్తున్నారని బీజేపీ గళం విప్పిన తరువాత వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు చెప్పారని దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. 600 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల కోసం ఆపడం దారుణం.. మహాత్మా గాంధీని కూడా అవమాన పరిచే విధంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుంది.. వైసీపీ సర్పంచ్ లు కూడా బయటకు వచ్చి గళం విప్పుతున్నారు.. సర్పంచ్ ల ఆందోళనకి జగన్ ఏం సమాధానం చెబుతారు అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.