చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నకిలీ వజ్రాలతో ఘరానా మోసానికి ప్రయత్నం చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గర నుంచి 12 నకిలీ వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ వేదికగా జరగనున్న బీజేపీ మహాజన సంపర్క్ అభియాన్ సభకు ఆయన హాజరుకానున్నారు. రాత్రి 7 గంటలకు పోర్టు గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. 8 గంటలకు సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా అమిత్ షా సమావేశం కానున్నారు. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారు.
బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించనున్నారు. జూన్ 8న అమిత్ షా విశాఖకు వస్తుండగా, 10న తిరుపతికి జేపీ నడ్డా రానున్నారు. అంతేకాకుండా ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనపై రాష్ట్రంలో రెండు భారీ బహిరంగ సభలకు బీజేపీ ప్లాన్ చేసింది.
భగ్గుమంటోన్న భానుడి ప్రభావంతో.. ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టాలంటే ఒకటికి పదిసార్లు జనం ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే తీవ్రతతో కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.
సింహాచలం చందనోత్సవంలో భక్తుల అందోళనకు దిగారు. వీవీఐపీ టిక్కెట్లు కొనుగోలు చేసిన గంటల తరబడి క్యూ లైనల్లో ఉండిపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. EO డౌన్ డౌన్ అంటూ భక్తులు నినాదాలు చేశారు.
సింహాచల పుణ్యకేత్రంలో వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనం ప్రారంభమైంది. అప్పన్న స్వామిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పుణ్యక్షేత్రంలో భక్తులతో కిటకిటలాడుతోంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంలో దర్శనం ఇస్తారు. అందువల్ల భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
* ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నేడు పర్యటన చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు. * నేడు సిట్ 6వ రోజు 9మంది నిందితుల విచారించనుంది. టీఎస్పీఎస్సీ నేడు 11 గంటలకు సిట్ ఎదుట పిసిసి…