చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
విశాఖలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్.. నగరంలో కలకలం రేగింది. ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు కిడ్నాప్ అయ్యారంటూ ఎంపీ సత్యనారాయణ.. విశాఖ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం అధికారులు వడ ప్రసాదం అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 45 గ్రాముల వడ 20 రూపాయల ధరతో భక్తులకు దేవస్థానం విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలోకి యువగళం పాదయాత్ర ప్రవేశించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో ఎంతో హైప్ క్రీయేట్ చేసి ఈ యాత్ర.. నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.
ఎన్ని రాజకీయ పార్టీలు ఒక్కటైనా ఒంటరిగానే పోటీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2014లో లానే మళ్ళీ 2024లో కలిసి పోటీ చేస్తారు ఏమో అంటూ విపక్షాలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు విసిరారు. కాశీ యాత్ర లాగా వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది? అంటూ ఎద్దేవా చేశారు.