Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!
- ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్
- పశ్చిమాసియా పరిణామాలపై చర్చలు
- దేశాలు సంయమనం పాటించాలని భారత్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ఫోన్‌లో మాట్లాడారు. తాజా పరిణామాలపై ఇరాన్‌తో చర్చించినట్లుగా ఎక్స్‌లో జైశంకర్ పేర్కొన్నారు.
మధ్యప్రాచ్యంలో కీలక భాగస్వాములతో సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కృషి చేస్తోంది. ప్రతి దేశానికి సంయమనం, దాడులను ఆపడం, చర్చలు కొనసాగించడం అత్యంత అవసరమని భారత్ అభిప్రాయపడింది. సంక్షోభం మరింత పెరగకుండా చర్చలు అవసరం అని భారత్ పేర్కొంది. అన్ని పక్షాలూ సంయమనం ప్రదర్శించవలసిన అవసరం ఉందని.. మానవికతను కాపాడేందుకు పని చేయాలని భారత్ కోరింది. భారత ప్రభుత్వం దౌత్యాన్ని, చర్చలను ప్రోత్సహించే దిశగా వెళ్తుందని తెలిపింది.
Also Read
ఇది కూడా చదవండి: Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!
ఇరాన్ వెనక్కి తగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు.
అంతేకాకుండా అమెరికా రక్షణ కార్యదర్శి హీట్ హెగ్సేత్ కూడా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు చూడని అత్యంత తీవ్రమైన దాడులు చేస్తామని సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్.. లెబనాన్‌పై విరుచుకుపడుతోంది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో పరిస్థితులు తీవ్రంగా నడుస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. హార్ముజ్ జలసంధి దగ్గర 16 ఇరాన్ బోట్లు ధ్వంసం
తాజావార్తలు
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?