AP CM Jagan Tour: ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులను సీఎం వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరనున్నారు. 10 గంటలకు చినమేరంగి పాలిటెక్నిక్ కళాశాల హెలీప్యాడ్‌కు సీఎం చేరుకోనున్నారు. కురుపాం బహిరంగ సభ వద్దకు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం జగనన్న అమ్మ ఒడి పథకం నాలుగో ఏడాది నిధులు విడుదల చేయనున్నారు.
Also Read: TTD: సరోగసీ విధానం ద్వారా జన్మించిన ఆవు.. ఏపీలో ఇదే తొలిసారి, టీటీడీ ఈవో ప్రకటన
కురుపాం నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే దాసరిపేట దగ్గర ఉన్న ఓ ప్రైవేటు పాఠశాల సమీపంలో సభా స్థలాన్ని అధికారులు సిద్ధం చేశారు. వాహనాలకు పార్కింగ్, హెలిప్యాడ్ స్థలాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ నిషాంత్‌కుమార్ పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.