ఇటీవల విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా చెప్పేంత వరకు జీవీఎల్ కు తెలియదా అంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందా నిజంగా జరిగితే ఎందుకు అడగలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
నేటి నుంచి వారాహి విజయయాత్ర చేపట్టనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నవరం సత్యదేవుని ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వారాహి వాహనానికి పూజలు నిర్వహంచారు. సాయంత్రం అన్నవరం నుంచి కత్తిపూడి సభకు పవన్ వెళ్తారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఈఏపీ సెట్–2023 ఫలితాలను బుధవారం ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
దేశంలో మహిళలపై ప్రతిరోజూ ఎక్కడో అక్కడ లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాత్రి సమయాల్లో సంగతి పక్కనబెడితే.. పట్టపగలు ఒంటరిగా మహిళలు బయట తిరగాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ మద్య కాలంలో కొంతమంది ఆకతాయిలు ప్రేమ పేరుతో యువతులను వేధిస్తున్నారు.
ఏలూరులోని విద్యానగర్‌లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు.
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో పొత్తులపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ, జనసేన ప్రస్తుతం పొత్తులో ఉన్నాయి.