CM Chandrababu: 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారు, మరో నలుగురిపై చర్యలు.. సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్!
- మంత్రుల సమావేశంలో సీఎం చంద్రబాబు హాట్ కామెంట్స్
- 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడాను
- 15 మంది ఎమ్మెల్యేలు దారికొచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Warns MLAs: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా రాజకీయ పరిణామాలపై అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. నిన్న రాత్రి సమీక్షా సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది.
ఇటీవల సుమారు 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడినట్లు మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపినట్టు సమాచారం. ఆ చర్చల అనంతరం దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు తన సూచనలతో దారికొచ్చారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. అదే సమయంలో నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్టు సీఎం మంత్రులకు తెలిపారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆ నలుగురు ఎమ్మెల్యేలపై చర్యలు తప్పవని సీఎం స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read
- Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
- BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
- Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
Also Read: CM Chandrababu: రెండు రోజులపాటు కలెక్టర్ల సమావేశం.. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలపై సీఎం సమీక్ష!
ఇక పార్టీ బలోపేతం కోసం ఎమ్మెల్యేలు, పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం మరింత బలపడాల్సిన అవసరం ఉందని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రజలతో అనుసంధానం పెంచుకోవడం, పార్టీ కార్యకర్తలతో సమన్వయం మెరుగుపరచడం ద్వారా పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాబోయే ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. సీఎం తీసుకునే నిర్ణయాలు పార్టీ లోపల ఎలా ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!