Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ అవినీతి చదివేకొద్దీ తన కళ్ల సైట్ పెరిగిందని పవన్ అన్నారు. రాజోలు విజయం గాయపడ్డ గుండెకు సేదతీరినట్లయిందని, రాజోలులో వెలిగించిన చిరుదీపం.. రౌడీలు, దౌర్జన్యాల పాలిట అఖండజ్యోతి అవుతుందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కులాల మధ్య చిచ్చుపెట్టడానికి తాను రాలేదని, కులాలను కలపడానికి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ అన్నారు. మలికిపురం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్‌పై పవన్ ఫైర్ అయ్యారు. బోటు అనే మా ఓట్లపై గెలిచి తెప్పదాటిన తరువాత మాపై దూషిస్తే ఊరుకోమన్నారు. 151 వైసీపీ ఎమ్మెల్యేలకు రాజోలు ఒక సమాధానమైందన్నారు. రాజోలు ప్రజలు అందించిన విజయం ఓయాసిస్‌లా పని చేస్తుందన్నారు. ఎమ్మెల్యే కావాలని పోటీ పడండి. మనలో మనం కొట్టుకుంటూ పార్టీని నట్టేట ముంచవద్దని నేతలకు సూచించారు. మన గెలుపు ప్రజల గెలుపు కావాలన్నారు.
Also Read: Modi Egypt Visit : భారత్, ఈజిప్ట్ మధ్య ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’.. ఎంఓయూపై సంతకాలు
కోనసీమ ప్రాంతం ఎందుకు కాలుష్యానికి గురైందని.. ఏటిగట్టులు ఎందుకు పటిష్టపర్చలేదని ? మల్కిపురంకు చిన్నపాటి స్మశాన వాటిక ఎందుకు లేదని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే ఎమ్మెల్యేలను నిలదీయాలని ప్రజలకు సూచించారు. 12 రోజులుగా సాగుతున్న వారాహి మొదటి దశ యాత్ర ఈరోజుతో ముగిసిందన్నారు. మొదటి దశ 8 నియోజకవర్గాల్లో పూర్తి చేశామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానేయాలని.. విద్య, వైద్యం సంపూర్ణంగా అందించే వారిని గెలిపించాలని సూచించారు. ఇలా మాట్లాడితే ఓట్లు పడతాయని నాకు లేదని.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తాను వ్యతిరేకమని పవన్ అన్నారు. మలికిపురం బైపాస్ రోడ్డు వేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల్లో రోడ్డు వేయకపోతే శ్రమదానం చేపట్టి తామే వేస్తామన్నారు. సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన ఎందుకు నిర్మించడం లేదని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేసినా ఇప్పటికీ ఎందుకు నిర్మాణం చేపట్టలేదని పవన్ ప్రశ్నించారు.