ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనుంది.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యనమల కృష్ణుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టే.. బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు.
లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. మూడు పార్లమెంట్, 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదని స్పష్టం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. అయితే, చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే.. కానీ, ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదు అని మాత్రమే చెప్పానన్నారు. చిరంజీవిని నేను విమర్శించా అని చెప్పడం ద్వారా కొంత మందిని అయిన దగ్గర చేసుకోవచ్చు అని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు అంటూ దుయ్యబట్టారు.