Vijayasai Reddy: ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురపించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ ప్రచారంలో వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడులకు కారకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని ఆరోపణలు గుప్పించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అన్నీ నేర సంస్కృతిలే చంద్రబాబులో ఉన్నాయన్న ఆయన.. రాష్ట్రంలో జరిగిన చాలా హత్యలకు కారణం చంద్రబాబే అని ఆరోపించారు. ఆయన ప్రభుత్వంలో ఎంతమందిని హత్య చేయించాడో అందరికీ తెలుసన్నారు. కానీ, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అంటూ ప్రశంసలు కురిపించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి..
Read Also: Aroori Ramesh: పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు ఊరుకోరు.. కడియంపై ఆరూరి కీలక వ్యాఖ్యలు