CM YS Jagan: అభివృద్ధి విషయంలో నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. అలాంటి బాబు డెవలప్‌మెంట్ కింగ్ ఎలా అవుతారు..? అని ప్రశ్నించారు ఏపనీ సీఎం వైఎస్ జగన్.. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజల్లో నమ్మకముండాలి.. ఒక మాట చెప్తే చేస్తాడన్న నమ్మకం ఆ నాయకుడిపై ఉండాలి.. ఈ 58 నెలల కాలంలో సీఎంగా మీకు మంచి మీ అందరి సమక్షంలో ఒకవైపు ఉన్నా.. మరోవైపు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా పేదలకు మేలు చేయని పెత్తందారీ ఉన్నాడు అని తెలిపారు.. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు మాత్రమే కాదు.. జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపు అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది.. ఐదేళ్లు మీ రక్తం త్రాగుతుందని హెచ్చరించారు.
Read Also: Kesineni Nani: గడప గడపకు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని శ్వేతా
ఇక, ఎవరు వంచన చేసేవారో.. ఎవరు న్యాయం చేశారో చూద్దామా? అని అడుగుతున్నా..? 2004లో జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు చెప్పిన మాటలు విని ఓటేస్తే ఏం జరిగింది..? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాం అన్నారు సీఎం జగన్.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొత్తం నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తే.. మేం వచ్చిన తర్వాత 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతున్నా..? రైతు రుణమాఫీ పై తొలిసంతకం అన్నాడు.. బ్యాంక్ లలో పెట్టిన బంగారం వేలం వేయించాడు.. ఇన్ టైమ్ లో రైతులకు ఏ ఒక్క మంచి పని అయినా చేశాడా ? అని నిలదీశారు. వ్యవసాయం దండగ అని చెప్పింది చంద్రబాబు కాదా..? రైతులకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు అరేసుకోవాలి చెప్పిన మాటలు చంద్రబాబువి కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also: Viral Video : డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన యువతి
తాము, పెట్టుబడికి సాయంగా రైతులకు అండగా ఉన్నాం.. పగటి పూట రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం అని వెల్లడించారు సీఎం జగన్.. చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమైనా కనిపిస్తుందా..? అని ప్రశ్నించిన ఆయన.. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ సచివాలయాలు కట్టింది ఎవరు అని అడుగుతున్నా..? ప్రతీ గ్రామానికి ఫైబర్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీ.. నాడు నేడు తో బడులు, ఆస్పత్రులు బాగుపడ్డాయి.. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు వచ్చాయి.. కొత్తగా నాలుగు పోర్టులు.. ఫిషింగ్ హార్బర్ లు వస్తున్నాయని తెలిపారు. అయితే, ఎయిర్ పోర్ట్ విస్తరణలు చేశారా? అని నిలదీశారు. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ ఏమైనా పథకాలు ఇచ్చారా..? మరి ఇదే చంద్రబాబు డెవలప్మెంట్ కింగ్ ఎలా అవుతాడు..? అని మండిపడ్డారు. డెవలప్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. నాది ప్రోగ్రెస్ రిపోర్ట్ గా అభివర్ణించిన ఆయన.. బడులకు వెళ్లే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం స్కూల్, టాబ్స్ పంపిణీ చేస్తున్నాం.. అమ్మఒడి పథకాలు ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నా..? అని ప్రశ్నించారు సీఎం వైఎస్ జగన్.