Emmanuel Macron: ‘‘రాఫెల్‌తో మీ దేశానికే లాభం, విమర్శలు ఎందుకు.?’’
- రాఫెల్ జెట్‌లతో భారత సైన్యం బలోపేతం..
- విమర్శలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. గురువారం మక్రాన్ భారత్‌తో 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. రాఫెల్ యుద్ధవిమానాలు భారత్‌ను బలమైన సైనిక శక్తిగా మారుస్తాయని, ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ ఒప్పందం భారత్‌లో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని కూడా చెప్పారు.
Read Also: Priyanka Gandhi: ‘‘ప్రధాని అవుతావు’’.. ప్రియాంకా గాంధీకి బాబా ఆశీర్వాదం..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
‘‘ప్రజలు దీనిని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇది మీ దేశాన్ని బలోపేతం చేస్తుంది’’ అని అన్నారు. 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌ను మక్రాన్ సమర్థించారు. ఒప్పందంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ ఒప్పందంలోని వాణిజ్య అంశం రాఫెల్‌ను తయారు చేసే డస్సాల్ట్ ఏవియేషన్, భారత ప్రభుత్వం మధ్య జరిగే సంభాషనల్లో భాగమని మక్రాన్ అన్నారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్(డీఏసీ) 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపిన వారం రోజులకే మక్రాన్ ఈ ప్రకటన చేశారు. దాదాపుగా ఈ ఒప్పందం విలువ రూ.3.25 లక్షల కోట్ల విలువైనది. భారత్-ఫ్రాన్స్ రక్షణ బంధం గురించి మక్రాన్ మాట్లాడుతూ.. వీలైన ఎక్కువ భాగాలు భారత్‌లో తయారు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!