రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా బీసీలకు మేలు చేసింది సీఎం జగన్ మాత్రమేనని బీసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీలకు జరిగిన మంచిని వివరిస్తూ.. రాష్ట్రవ్యాప్త పర్యటన చేస్తున్న పలు బీసీ సంఘాల నాయకులు పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, బీసీ కులాలకు అందిన సంక్షేమ పథకాలపై స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావుని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ జేఏసీ అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు యాదవ్, శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండెపూడి పురుషోత్తం, వడ్డెర పరిరక్షణ సమితి ఛైర్మన్ దేవళ్ల వెంకట్, ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ నారాయణ ముదిరాజ్ పాల్గొన్నారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ సైన్యం పాడు పని.. చిన్నారులపై లైగింక దోపిడీ
ఇక, బీసీలందరూ సీఎం జగన్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని బీసీ సంఘాల నేతలు అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు సీఎం జగన్ కు వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అన్నారు. దివంగల ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజ్ రీయింబర్స్ మెంట్ తో ఎంతో మంది బీసీలకు మేలు చేశారన్నారు. దానికి మిన్నగా సీఎం జగన్.. బీసీలకు రాజ్యాధికారం కోసం కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. 48 సీట్లు బీసీలకు కేటాయించడం చాలా సంతోషించాల్సిన విషయమన్నారు. రాజ్యసభకు ఐదుగురు బీసీలను పంపిన ఘనత సీఎం జగన్ దేనన్నారు.
Read Also: Sidhu moosewala: సిద్ధూ మూసేవాలా తండ్రి కీలక నిర్ణయం.. ఎన్నికల్లో పోటీపై బిగ్ ట్విస్ట్!
56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారని బీసీ సంఘాల నేతలు అంటున్నారు. 18 ఎమ్మెల్సీల్లో 11మంది బీసీలకు స్థానం కల్పించిన సీఎం జగన్ కి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బీసీలపై చిత్తశుద్ధి లేదన్నారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రం చేస్తున్నాయని విమర్శించారు. బీసీలను, ఎస్సీలను అవమానించిన చంద్రబాబును ప్రజలు నమ్మొద్దని సూచించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు బీసీ విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చాయన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. నర్సరావుపేట పార్లమెంట్ చరిత్రలోనే బీసీ అయిన అనిల్ కుమార్ యాదవ్ కి సీటు ఇచ్చి.. బీసీలపై తనకున్న ప్రేమను సీఎం జగన్ చాటారన్నారు. పార్లమెంట్ సీటుతో పాటు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపంచాలని కోరారు.