తిరువూరు పట్టణంలోని 19వ వార్డులో ఎన్డీయే కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటిఇంటికి తిరిగిన కొలికపూడికి మహిళలు మంగళ హారతులు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.
జలదంకి మండల నాయకత్వంలో కావలి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగుమాటి కృష్ణారెడ్డి సూచనలతో మాజీ సర్పంచ్ తేలపోలు పెద్ద పెంచలయ్య సారథ్యం వేములపాడు పంచాయతీకి చెందిన 10 కుటుంబాలు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సోదరుడు కాకర్ల సునీల్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
గుంటూరులోని ఆటోనగర్ లో గురువారం నాడు సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎట్టకేలకు 2 వేల రూపాయలు మార్పిడిలో టీటీడీ ప్రయత్నం ఫలించింది.. 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి 2 వేల రూపాయల నోట్ల మార్పిడిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రద్దుచేసిన విషయం విదితమే కాగా.. అటు తరువాత కూడా శ్రీవారి హుండీలో 2 వేల రూపాయలు నోట్ల పెద్ద సంఖ్యలో సమర్పించారు భక్తులు.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికారులతో సంప్రదించి నోట్ల మార్పిడి చేయాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.. దీనిపై సానుకూలంగా స్పందించారు రిజర్వ్…
చంద్రబాబు మళ్లీ ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారు.. ఏపీ నుంచి 25 ఎంపీలు మా కూటమికి వస్తారు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్.. ఏపీకి వచ్చిన ఆయన.. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం అయ్యారు.. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిస్థితులపై ప్రముఖంగా చర్చించారు.. సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి ఘటన సహా ఇతర అంశాలపై కూడా సుదీర్ఘ చర్చ సాగింది.
పాణ్యం నియోజకవర్గం మొత్తం పసుపుయంగా మారింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితరెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌరు అభిమానులు భారీ ర్యాలీగా వచ్చి కదం తొక్కారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కేశినేని శ్వేతా.