నా ఇద్దరు చెల్లెమ్మలతో కుట్రలు చేస్తూ రాజకీయాలు చేస్తున్నారు.. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో, ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు సీఎం జగన్.. మా ఇద్దరి చెల్లెమ్మలను ఎవరు పంపించారో ప్రజలందరికీ తెలుసు.. వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి బహిరంగంగా తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు..? అని ప్రశ్నించారు సీఎం జగన్
తన సొంత నియోజకవర్గం పులివెందులలో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్.. పులివెందుల సిద్ధమేనా...? అంటూ ప్రశ్నించిన ఆయన.. నా ప్రాణానికి ప్రాణమైన నా సొంత గడ్డ పులివెందుల.. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీగా అభివర్ణించారు.
చంద్రబాబు కన్నీటికి కారణమైన గన్నవరం నియోజకవర్గంలో నా విజయంతో ప్రజలు చంద్రబాబుకి గిఫ్ట్ గా ఇస్తారని నమ్ముతున్నాను అని యార్లగడ్డ వెంకట్రావ్ వెల్లడించారు.