Farmers: రైతులను పెళ్లి చేసుకుంటే మహిళలకు ప్రోత్సాహకాలు.. సీఎంకు ఎమ్మెల్యే లేఖ..
- రైతులను పెళ్లి చేసుకునే మహిళలకు ప్రోత్సహకాలు ఇవ్వాలి..
- సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేఖ..
- పలు రైతు సంఘాల నుంచి కూడా ఇదే డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farmers: రైతులను వివాహం చేసుకునే మహిళలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగనాథ్ ఆ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. తుమకూరు జిల్లాలోని కునిగల్ నియోజవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న రంగనాథ్ తన లేఖలో రైతుల పరిస్థితిని వివరించారు. తన అసెంబ్లీ నియోజకవర్గంలో వ్యవసాయంపైనే చాలా కుటుంబాలు ఆధారపడ్డాయని, వ్యవసాయం చేస్తున్న యువకులను వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చే మహిళలకు ప్రత్యేక అలవెన్సులు, ప్రత్యేక హోదా ప్రభుత్వం ప్రకటించాలని సీఎంను కోరారు.
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
కునిగల్ తాలూకా ప్రధానంగా గ్రామీణ ప్రాంతమని, వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని, ఈ ప్రాంతంలో చాలా మంది యువకులు జీవనోపాధి వ్యవసాయమే అని ఆయన అన్నారు. రైతులుగా ఉన్న యువకులను మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదని, దీంతో 30 ఏళ్లు దాటిని కూడా రైతులకు పెళ్లిళ్లు కావడం లేదని వాపోయారు. గ్రామీణ వ్యవసాయ వర్గాల్లో వివాహిలను ప్రోత్సహించడానికి సహాయక చర్యలు చేపట్టాలని సీఎంను అభ్యర్థించారు.
కర్ణాటకలో రైతు సంఘాలు కూడా గతంలో ఇలాంటి ఆందోళల్నే లేవనెత్తాయి. రైతులకు ప్రాధాన్యత తగ్గుతుండటంతో మహిళలు వారిని పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని ఆరోపించాయి. కొన్ని రైతు సంఘాలు రైతు కుటుంబాల సామాజిక స్థితి, ఆర్థిక భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేదా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. మాండ్యా, తుమకూరు వంటి జిల్లాల రైతులు కూడా సీఎం సిద్ధరామయ్యకు ఇలాంటి ప్రతిపాదనలే పెడుతున్నారు.
తాజావార్తలు
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!