ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు
రేపు పులివెందులలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపట్టిన వైసీపీలో ఫుల్జోష్ కనపడుతోంది. ఈ జోష్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వై నాట్ 175 టార్గెట్గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు(ఏప్రిల్ 25) పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
ఏపీలో పలువురు కీలక పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. ఇప్పటికే.. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా మరో ఇద్దరిని బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, బెజవాడ సీపీ కాంతి రాణాపై బదిలీ వేటు పడింది. వారి స్థానంలో.. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని పీఎస్సార్, బెజవాడ సీపీకి ఈసీ ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ఈసీ వేటు వేసిన ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులకు ఎన్నికల విధులు…