పవన్ కల్యాణ్‌కు ముద్రగడ సవాల్.. పిఠాపురంలో నిన్ను ఓడించకపోతే నా పేరు మార్చుకుంటా..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు.. ఇక, రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదన్న ఆయన.. పవన్ బూతులు మాట్లాడుతున్నాడు.. విషయం మీద అవగాహన లేక తెలుసుకోవడానికి ఖాళీ లేక మాట్లాడుతున్నాడు.. తుని రైలు దహనం జరిగినప్పుడు నీ పక్కన ఉన్న నెహ్రూ వైసీపీలోనే ఉన్నాడు తెలుసుకో అని సూచించారు. తుని రైలు ఘటనకి చంద్రబాబు కారణం.. ఆ విషయం పవన్ తెలుసుకోవాలన్నారు. నన్ను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నం చేశాడు అని ఆరోపించారు. నేను చవటను దద్దమ్మను.. కాపులు కోసం నువ్వు ఎందుకు రోడ్డు ఎక్కలేదు? అని నిలదీశారు ముద్రగడ.. పవన్ నా పై తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు.. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు.. అసలు వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కి ఉన్న హక్కు ఏంటి? అని నిలదీశారు. ఉద్యమానికి ఎప్పుడు మద్దతు ఎందుకు ఇవ్వలేదన్న ఆయన.. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చాడు? అసలు పవన్ అడ్రెస్ ఏంటి? ఎక్కడ పుట్టాడు..? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీరు పెట్టిన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచారు కదా? అని ఎద్దేవా చేశారు. ఇక, పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానన్న ఆయన.. సినిమాలలో నటించండి.. రాజకీయాల్లో కాదు అని సూచించారు. నీ పార్టీ త్వరలో ఫ్యాకప్ అవుతుంది.. పిఠాపురంలో నిన్ను తన్ని తరిమేస్తారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
గాజు గ్లాసు కోసం హైకోర్టుకు జనసేన.. 24 గంటల సమయం కోరిన ఈసీ..
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిని గాజు గ్లాస్ టెన్షన్ పెడుతుంది.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చిన ఎలక్షన్ కమిషన్.. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించింది.. అయితే, ఈ పరిణామాలపై హైకోర్టు మెట్లు ఎక్కింది జనసేన పార్టీ.. గాజు గ్లాసు గుర్తు స్వతంత్ర్య అభ్యర్థులకు కేటాయించడాన్నరి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.. దీనిపై విచారణ ప్రారంభం కాగా.. ఏపీ హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి.. జనసేన పార్టీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రెండు ప్రధాన పార్టీలతో జనసేన ఎన్డీయేలో పొత్తులో ఉంది.. అందుకే మేం అన్ని చోట్లా కాకుండా కొన్నిచోట్ల మాత్రమే పోటీకి దిగాం.. మిగతా చోట్ల పొత్తులో ఉన్న వేరే పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రచారం చేస్తున్నాం.. ఈ సమయంలో గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థులకు ఇవ్వటం వల్ల ప్రజల్లో కన్ఫ్యూజన్ ఏర్పడుతోంది.. గుర్తింపు పొందిన 2 పార్టీలతో జనసేన పార్టీ పొత్తులో ఉంది.. మేం పొత్తులో లేకపోతే జనసేన పోటీ చేయని చోట సింబల్ వేరే వారికి ఇస్తే ఇబ్బంది లేదు.. కానీ, ఇప్పుడు జరుగుతోంది అంతా ఎన్నికల వ్యవహారంలో భాగమే అని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక, జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కూడా ఈసీకి వినతి పత్రం ఇచ్చామని హైకోర్టుకు తెలిపింది జనసేన.. ఇప్పటి వరకు మాకు స్పందన లేదని.. రెండోసారి కూడా చీఫ్ ఎన్నికల అధికారికి ఇదే విషయంపై వినతి పత్రం ఇచ్చామన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నామని.. మిగతా సీట్లలో మా పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయి కాబట్టి ఆ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరామన్నారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థికి కేటాయించటం వల్ల పొత్తులో మిగతా పార్టీల అభ్యర్థులకు ఓటు వేసే విషయంలో ఓటర్లకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోందన్నారు. కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్ధి గాజు గ్లాసు గుర్తు ఉంటే, దాని పరిధిలో ఉన్న తునిలో స్వతంత్ర్య అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు ఇచ్చారు.. ఇలా చేయటం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతారని తెలిపారు. అయితే, 24 గంటల్లో జనసేన పార్టీ అభ్యంతరాలపై నిర్ణయం ఉంటుందని ఈ సందర్భంగా హైకోర్టుకు తెలిపింది ఎన్నికల కమిషన్.. దీంతో.. జనసేన పిటిషన్ పై తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్.. డెవలప్‌మెంట్ కింగ్ ఎలా అవుతారు..?
అభివృద్ధి విషయంలో నాది ప్రోగ్రెస్ రిపోర్ట్.. చంద్రబాబుది బోగస్ రిపోర్ట్.. అలాంటి బాబు డెవలప్‌మెంట్ కింగ్ ఎలా అవుతారు..? అని ప్రశ్నించారు ఏపనీ సీఎం వైఎస్ జగన్.. ప్రకాశం జిల్లా టంగుటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాయకుడంటే ప్రజల్లో నమ్మకముండాలి.. ఒక మాట చెప్తే చేస్తాడన్న నమ్మకం ఆ నాయకుడిపై ఉండాలి.. ఈ 58 నెలల కాలంలో సీఎంగా మీకు మంచి మీ అందరి సమక్షంలో ఒకవైపు ఉన్నా.. మరోవైపు గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా పేదలకు మేలు చేయని పెత్తందారీ ఉన్నాడు అని తెలిపారు.. ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు మాత్రమే కాదు.. జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపు అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్ర లేస్తుంది.. ఐదేళ్లు మీ రక్తం త్రాగుతుందని హెచ్చరించారు. ఇక, ఎవరు వంచన చేసేవారో.. ఎవరు న్యాయం చేశారో చూద్దామా? అని అడుగుతున్నా..? 2004లో జాబు రావాలంటే బాబు రావాలని చంద్రబాబు చెప్పిన మాటలు విని ఓటేస్తే ఏం జరిగింది..? మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చాం అన్నారు సీఎం జగన్.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొత్తం నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తే.. మేం వచ్చిన తర్వాత 2.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అన్నారు. బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతున్నా..? రైతు రుణమాఫీ పై తొలిసంతకం అన్నాడు.. బ్యాంక్ లలో పెట్టిన బంగారం వేలం వేయించాడు.. ఇన్ టైమ్ లో రైతులకు ఏ ఒక్క మంచి పని అయినా చేశాడా ? అని నిలదీశారు. వ్యవసాయం దండగ అని చెప్పింది చంద్రబాబు కాదా..? రైతులకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టలు అరేసుకోవాలి చెప్పిన మాటలు చంద్రబాబువి కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
బెజవాడలో విషాదం.. డాక్టర్ ఫ్యామిలీలో సూసైడ్..? ఐదుగురు మృతి
విజయవాడలో ఓ డాక్టర్ ఫ్యామిలీ మొత్తం మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.. గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ శ్రీనివాస్ సహా ఆయన కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబం ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో విచారణ చేపట్టారు.. ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ రామకృష్ణ కూడా పరిశీలించారు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు.. మృతుల్లో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలుగా గుర్తించారు.. గురునానక్ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో.. ఇంటి బయట ప్రాంగణంలో చెట్టుకు ఉరి వేసుకుని డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.. అయితే, ఇతర కుటుంబ సభ్యులు నలుగురు పీక కోయటంతో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు.. నలుగురిని హత్య చేసి శ్రీనివాస్.. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడా..? లేక అందరినీ హత్య చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు బెజవాడ పోలీసులు.. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఆయన భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)గా గుర్తించారు.. శ్రీజ ఆసుపత్రి యజమానిగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్.. అప్పుల కారణంగా శ్రీజ ఆసుపత్రిని.. ట్రస్ట్ ఆసుపత్రికి లీజుకు ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది..
కేసీఆర్ ను అసహ్యించుకునే ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు
కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే తెలంగాణ ప్రజలు వాళ్లను బండకేసి కొట్టి మరీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పాలేరు నియోజకవర్గం కూసుమంచి కార్నర్ మీటింగ్ లో భట్టి మాట్లాడుతూ.. అబద్దాల పునాదులపై బీఆర్ఎస్ పార్టీ నిర్మించబడిందన్నారు. కేసీఆర్ నోరు తెరిస్తే చెప్పేది అబద్దమే అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్దాలు అసహ్యంచుకునే తెలంగాణ ప్రజలు వాళ్లను బండకేసి కొట్టి మరీ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని తెలిపారు. అబద్దాలతో, కట్టు కథలతో ఈ దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వానిిక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ సంపదను, వనరులను ప్రజలకు చెందకుండా తన సన్నిహితులపై క్రోని కేపిటలిస్టులకు మోడీ కట్టబెడుతున్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ, రాష్ట్ర సందను కేసీఆర్ ఈ పదేళ్లలో దోచేశారు. మరోసారి బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపి సంపదను దోపిడీ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఒక వైపు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే బీజేపీ-మోడీ ఒకవైపు, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశ సందను ప్రజలకు పంచాలనే రాహుల్ గాంధీ మరోవైపు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు దగ్గరకు వచ్చారన్నారు. మనమంతా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ఖమ్మం అభ్యర్తి రామసహాయం రఘురామిరెడ్డికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా అని తెలిపారు.
జూన్ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు..
తెలంగాణ 10వ తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు బషీర్‌బాగ్‌లోని ఎస్‌సిఇఆర్‌టి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేశారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. జూన్ 3వ తేదీ నుండి 13 జూన్ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఫీజులు కట్టే విషయం త్వరలో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు. కాగా.. గతేడాదితో పోల్చుకుంటే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ఈ సంవత్సరము 06 పాఠశాలలు సున్నా శాతము ఫలితాలు పొందాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 99.05 % ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉందన్నారు. అదే విధముగా రాష్ట్రములో వికారాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 65.10 % సాధించి చివరి స్థానములో ఉందని తెలిపారు. పదోతరగతి ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఆరు పాఠశాలల్లో సున్నా శాతం నమోదైంది.
కేదార్ నాథ్ భక్తులకు అలర్ట్.. రోజుకు కేవలం 16000 మందికి మాత్రమే అనుమతి
ఉత్తరాఖండ్‌లో మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా భక్తులు యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. గత సంవత్సరం సుమారు 55 లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారు. దీని కారణంగా అనేక ఏర్పాట్లలో సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం దీని నుండి గుణపాఠం తీసుకొని ఉత్తరాఖండ్ పోలీసులు, పర్యాటక శాఖ చార్‌ధామ్ యాత్రలో భక్తుల కోసం రోజు వారీ పరిమితిని ఉంచింది. పర్యాటక శాఖ ప్రకారం, చార్‌ధామ్ యాత్రలో, కేదార్‌నాథ్ ధామ్‌లోని బాబా మహాకాల్‌ను ఒక రోజులో 15 వేల మంది భక్తులు దర్శనం చేసుకోగలరు. బద్రీనాథ్ ధామ్‌ను రోజుకు 16 వేల మంది, యమునోత్రిలో 9 వేల మంది భక్తులు, గంగోత్రిలో 11 వేల మంది భక్తులు దర్శించుకోనున్నారు. అంతే కాకుండా ఈ సంఖ్య పెరిగితే భక్తులను నిలువరించేందుకు త్రిషికేశ్‌లో అడ్డంకి పట్టణాలను కూడా సిద్ధం చేశారు. ఎవరైనా బద్రీనాథ్ వెళ్లాలనుకుంటే ముందుగా శ్రీనగర్‌లో నిలుపుతారని పర్యాటక శాఖ తెలిపింది. ఇక్కడి పరిమితి దాటితే భక్తులు రాత్రి ఇక్కడే గడపాల్సి వస్తుంది. దీని తర్వాత రుద్రప్రయాగ్, చమోలి, పిప్పల్‌కోటి, జోషిమఠ్‌లలో మరుసటి రోజు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే నంబర్ వస్తేనే మనం ముందుకు వెళ్లగలం. గంగోత్రి-యమునోత్రికి వెళ్లే భక్తులను రోజు పరిమితి ముగిసిన తర్వాత తెహ్రీ, చంబా, ఉత్తరకాశీలో నిలిపివేస్తారు. ఈ పట్టణాల్లో ఒకేసారి 20 నుంచి 30 వేల మంది బస చేయగలుగుతారు. ఇక్కడ హోటల్, హోమ్ స్టే సౌకర్యాలు ఉన్నాయి. ఇదే సమయంలో దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై టూరిజం శాఖ రోజువారీ పరిమితిని విధించడంపై హోటల్, హోమ్ స్టే వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో అసోసియేషన్ ప్రకారం.. ఇది వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుంది. ఉత్తరకాశీ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రకారం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేవలం టూరిజం, తీర్థయాత్రలపై ఆధారపడి ఉంటుంది. ఆరు నెలల కాలంలో కూడా భక్తుల సంఖ్య పరిమితంగా ఉంటే, వారి వ్యాపారం తగ్గుతుంది. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే హోటళ్లు, హోమ్‌స్టేలు మూతపడతాయి. ఉత్తరాఖండ్‌లో, ఆది కైలాష్, ఓం పర్వతాలకు రోడ్డు మార్గంలో ప్రయాణం కూడా దాదాపు ఒకటిన్నర నెలల ముందుగానే ప్రారంభమవుతుంది. ఈసారి మే 10వ తేదీన ఆది కైలాస దేవాలయం తలుపులు తెరుచుకోనున్నాయి.
పాకిస్థాన్ సైన్యం పాడు పని.. చిన్నారులపై లైగింక దోపిడీ
పాకిస్థాన్‌లో ఇప్పటి వరకు చిన్నారులపై లైంగిక దోపిడీ, అత్యాచారానికి సంబంధించిన అతిపెద్ద కేసు వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని ఖైబర్-పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఖైబర్-పఖ్తున్ఖ్వాలోని పరాచినార్ ప్రాంతంలో పెద్ద రాకెట్ బట్టబయలైంది. పాకిస్తాన్ ఆర్మీ, మిలిటరీ ఇంటెలిజెన్స్ సీనియర్ అధికారులకు లైంగిక దోపిడీకి పిల్లలను సరఫరా చేసినట్లు కూడా వెల్లడైంది. సమాచారం అందుకున్న పరాచినార్ పోలీసులు మొబైల్ షాపు యజమాని సయ్యద్ తాహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దుకాణదారుడు పిల్లలకు ఆడుకోవడానికి మొబైల్ ఫోన్లు ఇచ్చేవాడు. దాని సాకుతో అతను పిల్లల అభ్యంతరకరమైన వీడియోలను తీసి ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేసి ఆర్మీ, మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులకు పంపేవాడు. నిందితుడి ల్యాప్‌టాప్ నుంచి ఇప్పటివరకు 1200కు పైగా వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం గ్యాంగ్‌లో దాదాపు ఐదారుగురు వ్యక్తులు ఉన్నారు. ఇందులో పాకిస్థాన్ ఆర్మీకి చెందిన మేజర్ ఆఫ్రిది మాస్టర్ మైండ్ అని చెప్పబడుతోంది. ఈ అమాయక పిల్లలందరినీ 73 బ్రిగేడ్ పరాచినార్‌కు పంపారు, అక్కడ వారిని పాక్ ఆర్మీ అధికారులు లైంగికంగా వేధించారు. గత ఐదేళ్లలో అతను పరాచినార్‌కు చెందిన వందలాది మంది పిల్లలను లైంగికంగా దోపిడీ చేశాడు.. అత్యాచారం చేశాడు.
అన్నింటికీ క్రెడిట్ కార్డు వాడేస్తున్నారా..? కొత్త రూల్స్‌తో జాగ్రత్త..
క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ముఖ్య గమనిక. మే 1 నుంచి పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డ్ లావాదేవీల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇటీవలే ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లు మే 1వ తేదీ నుంచి తమ క్రెడిట్ కార్డ్ నుంచి యుటిలిటీ బిల్లులు అంటే ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, గ్యాస్ బిల్ చెల్లిస్తే ఒక శాతం రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలిపాయి. దీనిప్రకారం మీరు ఎస్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ క్రెడిట్ కార్డు వినియోగిస్తూ, నెలవారీ కరెంటు బిల్ 15 వందలు చెల్లిస్తుంటే..అదనంగా 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడ కూడా బ్యాంకులు ఉచిత లావాదేవీలకు కొంత లిమిట్ ప్రకటించాయి. వినియోగదారులు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 15,000, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 20,000 రూపాయల వరకూ ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. లిమిట్ దాటితే వన్ పర్సెంట్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. 18 శాతం జీఎస్టీని సైతం చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్రమంగా క్రెడిట్ కార్డుల వినియోగం పెరుగుతోన్న విషయం విదితమే.. కొందరు ఇంటి అద్దులు సహా వివిధ బిల్లులను క్రెడిట్ కార్డుపై కట్టేస్తున్నారు. ఆ తర్వాత వెసులుబాటును బట్టి చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఇంటి అద్దెలపై అదనపు చార్జీలు వడ్డిస్తున్నాయి కొన్ని బ్యాంకులు.. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్.. ఇలా పలురకాల బిల్లు చెల్లింపై కూడా వడ్డించేందుకు సిద్ధం అయ్యాయి.
టీమ్ మీటింగ్‌లకు సునీల్ నరైన్ రాడు: శ్రేయస్ అయ్యర్
కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్ 2024లో ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారని ప్రశంసించాడు. టీమ్ మీటింగ్‌లకు సాల్ట్ వస్తాడని, నరైన్ రాడని చెప్పాడు. ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా ఓపెనర్లు సాల్ట్, నరైన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. ముఖ్యంగా నరైన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఓపెనర్ల జోరుతో కోల్‌కతా ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి.. ప్లే ఆఫ్ దిశగా సూలుకెళుతోంది. సోమవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం కోల్‌కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ… ‘గత కొన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే 200 స్కోరు తక్కువే అనిపిస్తోంది. పవర్‌ప్లే తర్వాత పిచ్ స్పిన్నర్లకు అనుకూలించింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉంటుంది, ఎలా ఆడాలనే విషయంలో మాకు సరైన అవగాహన ఉంది. సునీల్ నరైన్ టీమ్ మీటింగ్‌లకు రాడు. ఫిల్ సాల్ట్ మాత్రం వస్తాడు. నరైన్ పూర్తిగా ఆటలో నిమగ్నమై ఉంటాడు. అతడు ఆడుతున్న తీరు చూస్తే ఆనందం కలుగుతోంది’ అని అన్నాడు.
ప్రపంచకప్‌కు అతడిని సెలక్ట్ చేయండి.. బీసీసీఐకి షారుక్ ఖాన్ విజ్ఞప్తి!
జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ 2024 ఆరంభం కానుంది. మెగా టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు. ఈ నేపథ్యంలో మరికొన్ని గంటల్లో భారత జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. అయితే ఇప్పటివరకు కూడా భారత జట్టుపై సరైన స్పష్టత లేదు. దాంతో జట్టులో చోటు ఎవరికి దక్కుతుంది?, ఎవరిపై వేటు పడుతుంది? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సమయంలో బాలీవుడ్ బాద్ షా, కోల్‌కతా నైట్ రైడర్స్ సహయజమాని షారుఖ్ ఖాన్.. బీసీసీఐకి ఓ విజ్ఞప్తి చేశారు. భారత టీ20 ప్రపంచకప్ జట్టుకు యువ ఆటగాడు రింకూ సింగ్‌ను ఎంపిక చేయాలని షారుఖ్ ఖాన్ కోరారు. స్టార్ స్పోర్ట్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ… ‘అద్భుతమైన ప్లేయర్స్ దేశం కోసం ఆడుతున్నారు. రింకూ సింగ్ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడి దయవల్ల అతడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాలి. అందుకోసం ఎదురుచూస్తున్నా. ఇతర జట్లకు చెందిన మరికొందరు యువకులు కూడా జట్టులో భాగం కావాలి. చాలా మంది ప్లేయర్స్ ఇందుకు అర్హులు. కానీ రింకూ జట్టులో ఉండాలని ఆశిస్తున్నా. అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను. అది నాకు గొప్ప విషయం’ అని అన్నారు. ‘కస్టపడి పైకి వచ్చిన వారు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. కుర్రాళ్లు ఆడే సమయంలో నేను కూడా క్రీడాకారుడిగా గొప్ప అనుభూతి చెందుతుంటా. రింకూ సింగ్, నితీశ్ రాణా లాంటి ఆటగాళ్లలో నన్ను నేను చూసుకుంటా. వాళ్లు మంచి ప్రదర్శన చేస్తే ఎంతో సంతోషిస్తా’ అని షారుఖ్ ఖాన్ తెలిపారు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ చివరి ఓవర్‌లో అద్భుతమైన విజయం సాధించింది. 20వ ఓవర్‌లో రింకు వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్‌తో అతడు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆ సీజన్‌లో 474 పరుగులతో ఆకట్టుకున్న రింకూ.. టీమిండియాలోకి అరంగేట్రం చేసాడు. భారత్ తరఫున 15 టీ20ల్లో రెండు అర్ధ సెంచరీలతో 356 రన్స్ చేశాడు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024కు గట్టి పోటీ దారుడుగా ఉన్నాడు.
చైతూ షాకింగ్ డెసిషన్.. ఏంటి ఇలా మారిపోయాడు?
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ లో పెట్టేస్తున్నాడు.. గతంలో ధూత సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా సాలిడ్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు అదే జోష్ లో మరో మూవీ తండేల్ సినిమాను చేస్తున్నాడు.. ఆ సినిమా భారీ ధరకు ఓటీటీ డీల్ కుదుర్చుకుంది.. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. త్వరలోనే ఆ సినిమా కూడా రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతుంది.. చై మూడవసారి దర్శకుడు చందూ మొండేటితో కలిసి జాతీయవాద అంశాలతో కూడిన గ్రామీణ ప్రేమకథ తండేల్ సినిమాలో చేస్తున్నాడు.. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.. ఇక ఇప్పుడు మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.. కార్తిక్ దండు దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. Svcc మరియు సుకుమార్ రైటింగ్శ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.. అంజిష్ లోకానాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు.. ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో నాగచైతన్య ఉన్నారు..
పవన్ ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..బిగ్ అనౌన్స్మెంట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి కొనసాగుతుంది.ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎన్నికల హడావిడిలో ఎంతో బిజీ గా వున్నారు.ఈ నేపథ్యంలో పవన్ తన లైనప్ లో వున్న మూడు సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చారు.వాటిలో హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజి సినిమాలు వున్నాయి .ప్రస్తుతం ఈ మూడు చిత్రాల ప్రొడ్యూసర్స్ పవన్ డేట్స్ కోసం పవన్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు .ఇదిలా ఉండగా క్రిష్ – పవన్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడో ప్రారంభం అయిన విషయం తెలిసిందే . ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి మేకర్స్ సినిమాపై అంచనాలను పెంచేశారు.. కానీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేకపోవడం, ఇన్ని సంవత్సరాలైనా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ సినిమా ఆగి పోయిందేమో అనే అభిప్రాయం మొదలయింది కానీ ఈ మూవీ మేకర్స్ తాజాగా పవన్ ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ అందించారు .మే 2 వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ చిత్ర టీజర్ విడుదల చేయనున్నట్లుగా.. ధర్మం కోసం యుద్ధం అంటూ మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు దీనితో పవన్ ఫాన్స్ ఖుషి అవుతున్నారు.