ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజక వర్గ పరిధిలోని నందిగామ పట్టణంలోని ఆర్ టి ఓ కార్యాలయం రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు తనధైన స్టైల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటి ఇంటికి తిరుగుతూ.. ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, తనను మరొసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నారు. చిక్కటి చిరు నవ్వుతో, ఆప్యాయంగా అందరిని పలకరిస్తూ.. ప్రచారంలో ముందుకు కొనసాగుతున్నారు. ప్రచారంలో ప్రజలు నుంచి మొండితోక జగన్ మోహనరావుకు మంచి స్పందన లభిస్తుంది.
Read Also: Sabari : ‘శబరి’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్..ఆకట్టుకుంటున్న లిరిక్స్..
గత ప్రభుత్వం చట్టన్నవరం గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు.. కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే మొండితోక జగన మోహన్ రావు అన్నారు. ఇక, నాడు- నేడు ద్వారా ఇక్కడ ఉన్న స్కూల్స్, రోడ్లు అని బాగు చేశామన్నారు. మేం మేనిఫెస్టో 2024లో చెప్పిందే చేస్తాం.. చేయ్యగలిగిందే చెప్తాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. గత చంద్రబాబు పాలనలో 12 శాతం మాత్రమే మేనిఫెస్టో్లోని పథకాలను అమలు చేశారు.. కానీ, సీఎం జగన్ మాత్రం 99 శాతం పథకాలను ప్రజలకు అందించారని నందిగామ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొండితోక జగన్ మోహన్ రావు వెల్లడించారు.