Vijayawada Crime: విజయవాడలో ఓ డాక్టర్ ఫ్యామిలీ మొత్తం మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.. గురునానక్ నగర్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ శ్రీనివాస్ సహా ఆయన కుటుంబంలోని ఐదుగురు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బాధిత కుటుంబం ఆర్థోపెడిక్ డాక్టర్ శ్రీనివాస్ కుటుంబంగా గుర్తించారు పోలీసులు. అయితే, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో విచారణ చేపట్టారు.. ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ రామకృష్ణ కూడా పరిశీలించారు.. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దింపారు.. మృతుల్లో భార్యా భర్త, ఇద్దరు పిల్లలు, ఒక వృద్ధురాలుగా గుర్తించారు..
Read Also: LSG vs MI: లక్నోకు గుడ్‌న్యూస్.. ముంబైకి దబిడిదిబిడే!
గురునానక్ నగర్‌లో జరిగిన ఈ ఘటనలో.. ఇంటి బయట ప్రాంగణంలో చెట్టుకు ఉరి వేసుకుని డాక్టర్ శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.. అయితే, ఇతర కుటుంబ సభ్యులు నలుగురు పీక కోయటంతో మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు.. నలుగురిని హత్య చేసి శ్రీనివాస్.. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడా..? లేక అందరినీ హత్య చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు బెజవాడ పోలీసులు.. మృతులు డాక్టర్ శ్రీనివాస్ (40), ఆయన భార్య ఉషారాణి (36), పిల్లలు శైలజ (9), శ్రీహాన్(5), శ్రీనివాస్ తల్లి రమణమ్మ (65)గా గుర్తించారు.. శ్రీజ ఆసుపత్రి యజమానిగా ఉన్న డాక్టర్ శ్రీనివాస్.. అప్పుల కారణంగా శ్రీజ ఆసుపత్రిని.. ట్రస్ట్ ఆసుపత్రికి లీజుకు ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది..