బనగానపల్లె జుర్రేరు వాగు ఆధునీకరణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి... కాటసాని రామిరెడ్డికి సవాల్ విసిరిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాటసాని తన అనుచరుని ఫంక్షన్ హాల్ కోసమే జుర్రేరు వాగు ఆక్రమించి వాకింగ్ ట్రాక్ నిర్మించారని ఆరోపించారు.. అక్రమ నిర్మాణాలన్నీ కచ్చితంగా తొలగిస్తాం, ఆక్రమణదారులకు శిక్ష తప్పదని హెచ్చరించారు.. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ నడి బొడ్డున ఉన్న జుర్రేరు వాగు ఆధునీకరణకు సంబంధించి మంత్రి…
గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించారని మండిపడ్డారు జేసీ.. ప్రస్తుతం టీడీపీ కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు.. ఎమ్మెల్యేలు, నాయకులు బయటకు రావాలని పిలుపునిచ్చారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తే ఇంటికొచ్చి చెప్పుతో కొడతా అంటూ హెచ్చరించారు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాడిపత్రి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యేలను వెనకేసుకొస్తున్నాడు.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంగతి త్వరలోనే తేలుస్తా అన్నారు.
క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధం అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటించనున్నట్టు వెల్లడించారు.. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని.. ఆ రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని.. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని వెల్లడించారు..
కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు అదొక పరీక్ష.. కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకొండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు జగన్.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. రాష్ట్రంలో రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు.
సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రిషితేశ్వరి కేసును కొట్టివేసింది గుంటూరు కోర్టు.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా, రిషితేశ్వరి కేసు కొట్టేస్తున్నామని తుది తీర్పు వెలువరించింది గుంటూరు జిల్లా ఐదవ కోర్టు.. నాగార్జున యూనివర్శిటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో తీవ్ర కలకలం సృష్టించిన విషయం విదితమే.
జెట్ స్పీడ్‌తో నేషనల్ హైవే ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించడంపై ఫోకస్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. అనంతరం నేషనల్ హైవే ప్రాజెక్టుల ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.. NHAI, MoRTH ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.. కాకినాడ పోర్ట్ వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రేషన్ బియ్యం పట్టుబడ్డ నౌక వద్దకు ప్రత్యేక బోట్లో వెళ్లిన పవన్.. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పరిశీలించారు.. ఈ బియ్యం ఎవరు సరఫరా చేశారని ఆరా తీశారు.. సముద్రంలో 9 నాటికల్ మైళ్ల దూరంలో పట్టుబడ్డ 640 టన్నుల బియ్యం వద్దకు స్వయంగా వెళ్లి పరిశీలించారు పవన్…
Nara Lokesh : పాఠశాల విద్యావ్యవస్థకే అతి పెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల సమావేశం (PTM)లో పాల్గొని విజయవంతం చేస్తారని కోరుతూ మంత్రి నారా లోకేష్ లేఖ విడుదల చేశారు. ఈ సమావేశం పాఠశాలల బలోపేతానికి, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందన్నారు. ఎడ్యుకేట్, ఎంగేజ్,ఎంపవర్ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7న విద్యార్థుల…