విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో తమ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగిందనే విధంగా చూపించేందుకు కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఏపీ చరిత్రలోనే మా హయాంలో జరిగిందే అత్యంత చవకైన విద్యుత్ కొనుగోలు అని స్పష్టం చేశారు.. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటీవ్ ఇస్తామని చెప్పింది.. రూ.5.10 నుంచి రూ.2.49కి యూనిట్ ధర తగ్గింది.. మనకు 15 వే9ల మి.యూ. విద్యుత్ వినియోగం ఉంది.. దీని వల్ల లక్ష…
రాష్ట్రం తిరోగమనంలో ఉంది.. గత ఐదేళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి.. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్నీ వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది అంటూ ధ్వజమెత్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు.. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్‌లు, సాండ్ స్కామ్‌లు కనపడుతున్నాయి.. పేకాట క్లబ్‌లు, మాఫీయా వ్యవహారం నడుస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమయ్యారు మంత్రి గొట్టిపాటి రవి కుమార్.. ఈ సందర్భంగా తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆక్వా రైతులు. నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేయాలని మంత్రిని కోరారు రైతులు.. అయితే, వారి సమస్యలను విన్న మంత్రి గొట్టిపాటి.. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు రైతులకు హామీ ఇచ్చారు..
రైతులకు అండగా ఉంటాం.. ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పిస్తాం.. కానీ, రైతులు దళారులను ప్రోత్సహించొద్దు అని సూచించారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. కృష్ణా జిల్లాలో పర్యటించిన ఆయన.. పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్లపై ఆరబోసిన ధాన్యపురాసులను పరిశీలించారు.. రైతులతో మాట్లాడుతూ.. ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జరుగుతుందంటూ భరోసా ఇచ్చారు..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అంచనా వేసింది..
ఎమ్మెల్యే... నియోజకవర్గానికి రారాజు లాంటివాడు. అందునా అధికార పార్టీ శాసనసభ్యుడు అయితే... ఆ లెక్కే వేరు. ప్రత్యేకించి అభివృద్ధి పనుల విషయంలో తన ప్రమేయం లేకుండా చీమ చిటుక్కుమన్నా నానా రచ్చ చేసే ఎమ్మెల్యేలకు కొదవే లేదు. కానీ.... ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని తాడికొండ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ పరిస్థితి మాత్రం రివర్స్‌లో ఉందట.
రాష్ట్రవ్యాప్తంగా ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇబ్బందుల నేపథ్యంలో కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.. ఇసుక లభ్యత, పారదర్శకంగా సరఫరా, అక్రమాల నియంత్రణ వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు..
బాపట్ల ఫార్మసీ కాలేజీలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ వి.సాయికిషోర్ తన విద్యార్థులతో కలిసి చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన పేటెంట్ మంజూరు చేసింది.. ప్రస్తుత ప్రజల జీవన శైలిలో వస్తున్న మార్పులపై డా కిషోర్ సాయి పరిశోధన చేశారు.. సాధారణంగా గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు తెల్లవారుజామున విడుదల కావడమే అందుకు కారణమని.. రాత్రి వేళల్లో కొన్ని ప్రత్యేక మెడిసిన్స్ వాడితే తెల్లవారుజామున గుండెపోటు రావనీ,…