AP Ration Mafia: రంగంలోకి సీఐడీ.. రేషన్ మాఫియాపై విచారణ షురూ..
- బియ్యం దొంగల భరతం పట్టే స్పెషల్ ఆపరేషన్..
- ఏపీ రేషన్ మాఫియాపై సీఐడీ విచారణ షురూ..
- ఆరుగురు ఐపీఎస్‌లపై అభియోగాలు..
- పోర్టుల నుంచి స్మగ్లింగ్‌పై పూర్తి వివరాలు ఆరా తీస్తున్న సీఐడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Ration Mafia: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రేషన్ బియ్యం యధేచ్చగా ఇతర దేశాలకు తరలిపోవడం వెనక మిల్లర్లు., బడ వ్యాపారులప్రమేయాన్ని నిర్ధారించడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ దగ్గర వున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆరుగురు IPS ల సహకారంతో నేషనల్ హైవే మీద రేషన్ బియ్యం యధేచ్చగా తరలిపోయిన విషయం ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామన్నారాయన.
Read Also: RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇప్పటికే కాకినాడు కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్లో అణువణువూ తనిఖీ జరుగుతుండగా CID ఎంట్రీపై ఆసక్తీ నెలకొంది. ఒక్క సివిల్ సఫ్లైశాఖ 729 మందిపై కేసులు పెట్టింది. 102 వాహనాలను సీజ్ చేసింది. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా… రౌడీ షీట్లు తెరుస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. బియ్యం దొంగల భరతం పట్టేందుకు ఏపీ సర్కార్ CID విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.. గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి రేషన్ బియ్యం దారి మళ్లించారని.. ఆరుగురు ఐపీఎస్‌లు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని సర్కార్ చెబుతోంది. కాకినాడతో పాటు వివిధ పోర్టుల ద్వారా తరలిపోయిన బియ్యం లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది సీఐడీ.. ఇప్పటికే నాదెండ్ల మనోహర్ పలుమార్లు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగి.. నేరుగా పట్టుబడిన రేషన్ బియ్యాన్ని పరిశీలించడం.. అధికారుల వైఫల్యాలపై తీవ్రస్థాయిలో మండిపడడంతో.. ప్రభుత్వం ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకుంది.. సీఎం చంద్రబాబును కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ విషయంపై చర్చించడం.. కేబినెట్‌లో కూడా ఈ అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వం రేషన్ బియ్యం అక్రమ తరలింపులపై సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!