* అడిలైడ్: నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య డే అండ్ నైట్ టెస్ట్ (పింక్ బాల్ టెస్ట్).. ఉదయం 9.30కి ప్రారంభంకానున్న మ్యాచ్
* నేడు పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్.. ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్ అమలు చేస్తోన్న పోలీసులు.
* నేడు విశాఖ వేదికగా డీప్ టెక్నాలజీ – 2024 సమ్మిట్.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం చంద్రబాబు
* హైదరాబాద్: సాయంత్రం 4 గంటలకు ప్రజాపాలన – విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో హోం శాఖ వేడుకలు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
* హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్..
* అమరావతి: ఇవాళ్టి నుంచి రెవెన్యూ సదస్సులు.. 33 రోజులపాటు నిర్వహణ… ప్రతీ గ్రామంలో ఎంఆర్ఓ స్ధాయి అధికారి ఆధ్వర్యంలో సదస్సు.. భూకబ్జాలు, ఆక్రమణలు, భూ వివాదాలు పరిష్కరించనున్న ప్రభుత్వం.. అక్కడికక్కడే ప్రతీ భూ సమస్యలు పరిష్కరించేలా చర్యలు..
* నెల్లూరు: రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో జరిగే రెవెన్యూ సదస్సులో పాల్గొంటారు
* నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి… వెంకటగిరిలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నేడు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఇంఛార్జ్ మినిస్టర్ హోదాలో విశాఖలో పర్యటనలో..
* మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
* ప్రకాశం : ఒంగోలు వైసీపీ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్న జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి..
* ప్రకాశం: రాచర్ల మండలం ఆకవీడులో రెవిన్యూ సదస్సు, ముఖ్య అతిథిగా హాజరుకానున్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి..
* ప్రకాశం : ఒంగోలులో సమస్యల పరిష్కారం కోసం నగరంలో వాలంటీర్ల భారీ ర్యాలీ.. కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం..
* అల్లూరి జిల్లా: నేడు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన… మినూములూరు DR డిపో విజిట్.. డ్వాక్రా మహిళలతో ఇష్టాగోష్టి.
* విశాఖ: నేడు కైలాసగిరి పోలీసు గ్రౌండ్ లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు అథ్లెటిక్స్ మీట్.. ప్రారంభించనున్న APSRTC చైర్మన్ కొనకళ్ల నారాయణ
* విజయవాడ: నేడు హోమ్ గార్డ్స్ రైసింగ్ డే ఉత్సవాలు.. సిటీ ఆర్మ్ డ్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న సీపీ రాజశేఖర్ బాబు
* అమరావతి: వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు విచారణ
* విజయవాడ: బెజవాడలో కేంద్ర టూరిజం మంత్రి సురేష్ గోపి. కృష్ణవేణి నీరాజనాలు కార్యక్రమంలో పాల్గొననున్న సురేష్ గోపి, రాష్ట్ర మంత్రులు
* రాష్ట్ర టూరిజం సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేటి కార్యక్రమాలు.. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో “కృష్ణవేణి సంగీత నీరాజనం-2024 మ్యూజిక్ ఫెస్టివల్” కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు “సౌత్ ఇండియన్ ఫిలిం 1980 ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు.
* గుంటూరు: నేడు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను లో 25 కోట్ల రూపాయలతో ,నిర్మిస్తున్న అగ్రికల్చరల్ టెక్నాలజీ ,ఇన్నోవేషన్ సెంటర్ ను, ప్రారంభించనున్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…
* వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు, డ్రోన్ ల ఎగ్జిబిషన్ ను ప్రారంభించనున్న, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు…
* పల్నాడు: నేడు సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్…
* విజయవాడ పర్యటనలో మంత్రి పయ్యావుల కేశవ్.. పెనుకొండలో పర్యటించనున్న మంత్రి సవిత.
* అనంతపురం : నేటి నుంచి బొమ్మనహాళ్ మండలం నేమకల్లుకు బస్సు సర్వీసు.. నెరవేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ.. నవంబర్ 30న నేమకల్లు సీఎం పర్యటన సమయంలో తమ గ్రామానికి బస్సు నడపాలని విజ్ఞప్తి చేసిన గ్రామస్థులు.
* తిరుపతి: నేడు మద్యాహ్నం12 పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం… తిరుమల శ్రీవారి నుండి తిరుచానూరు రానున్న సారే.. తెలుగు రాష్టాలతో పాటు కర్నాటక, తమిళనాడు నుండి సూమారు రెండు లక్షల మంది భక్తులు చక్ర స్నానంకి వస్తారని అంచనా ..
* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 46,927 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,560 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.2.97 కోట్లు