నేడు డీప్ టెక్ సమ్మిట్-2024.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
విశాఖ మరో కీలక సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. గ్లోబల్ ఫోరం సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫార్మేషన్ GFST ఆధ్వర్యంలో “డీప్ టెక్ సమ్మిట్-2024″కు వేదికైంది. ఇక, ఈ కీలక సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు అవుతున్నారు. ఈ సదస్సులోనే వచ్చే ఐదేళ్ల కాలానికి రోడ్ మ్యాప్ రూపొందించే అవకాశం వుంది. హెల్త్ రంగం, ఎంఎస్‌ఎం ఇల గ్రోత్‌కి ఈ సమ్మిట్ దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో గ్రోత్ జాబ్స్ సాధన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా డీప్ టెక్ సమ్మిట్-2024 కీలకంగా మారింది. భారతదేశం గ్లోబల్ డీప్ టెక్నాలజీ ఏఐ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలకు హబ్‌గా మారుతున్న తరుణంలో డీప్‌టెక్ రివల్యూషన్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రోజువారీ పనుల్లో వినియోగించే టెక్నాలజీకి ఆవిష్కరణలను తోడు చేయడమే ‘డీప్ టెక్ సమ్మిట్’ ఉద్దేశం. పౌర సేవలు, పాలనలో పారదర్శకత వంటి విషయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి.. ఐటీ రంగంలో అభివృద్ధిపై ఒక ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం వుంది. ఐటీ రంగంలో ఇన్నోవేషన్స్, పాలసీ మేకర్‌లు, ఇండస్ట్రీ లీడర్లు ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. సీఎం షెడ్యుల్ లో ఎక్కువ సమయం డీప్‌టెక్ సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోనే వుండే విధంగా ఫిక్స్ అయ్యింది. ఈ పర్యటనలో భాగంగా VMRDA అభివృద్ది పనులుపై సమీక్ష, NTR భవన్ లో ముఖ్య నాయకత్వంతో సమావేశం వంటివి వున్నప్పటికీ డీప్ టెక్ సమ్మిట్ సమయం మీద ఆధారపడి మిగిలిన కార్యక్రమాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
నేటి నుంచి రెవెన్యూ సదస్సులు.. అక్కడికక్కడే భూ సమస్యల పరిష్కారం..!
రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇందుకోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోంది. కోర్టులకు వెళ్లకుండా సర్కార్ పరిధిలో పరిష్కరించే సమస్యలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులు జరుగుతాయి. గత ప్రభుత్వ హయాంలో భూవివాదాలు పెరిగిపోయాయని.. కబ్జాలు, ఆక్రమణలు జరిగాయని.. ఆరోపిస్తోంది కూటమి ప్రభుత్వం.. అయితే, ఏపీలో భూ వివాదాలకు పరిష్కారం చూపేందుకు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 17,564 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పరిష్కారం కాకుండా మిగిలిపోయిన వివాదాలపై ఇందులో చర్చించి.. తగు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇవాళ ప్రారంభమై 33 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ సదస్సులు జరగనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూ వివాదాలు బాగా పెరిగినట్టు కూటమి సర్కార్ గుర్తించింది. అలాగే లెక్కకు మిక్కిలిగా వస్తున్న ఫిర్యాదుల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. భూములకు సంబంధించిన అన్ని రకాల సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో ఫిర్యాదులు తీసుకుంటారు. వాటికి స్పాట్‌లోనే పరిష్కారం చూపనున్నారు. అలాగే, సదస్సుల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డుల్ని ప్రదర్శిస్తారు. అసైన్డ్, ప్రీ హోల్డ్, లీజ్, కేటాయింపు భూముల వివరాలు కూడా ప్రకటిస్తారు. మరోవైపు గతంలో ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో అనర్హుల ఏరివేతకు కూడా శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అంతేకాకుండా అసైన్డ్, ప్రీ హోల్డ్ భూముల్లో అక్రమాలు జరిగాయా అన్నది కూడా రెవెన్యూ సదస్సులు ప్రత్యేకంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెబుతోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 80 శాతం సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అంచనా వేస్తోంది సర్కార్.
రంగంలోకి సీఐడీ.. రేషన్ మాఫియాపై విచారణ షురూ..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న బియ్యం అక్రమ రవాణా కేసు విచారణ కొత్త మలుపు తిరిగింది. కాకినాడ తీరంలో రేషన్ బియ్యంతో స్టెల్లా నౌక పట్టుబడటం, అక్రమ రవాణా వెనుక యంత్రాంగం అలసత్వం, మాఫీయాను మించిన నెట్వర్క్ ఏర్పడిపేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్న తీరుపై సీరియస్ అయ్యింది. ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సమగ్ర విచారణ కోసం CBCID కి అప్పగించాలని నిర్ణయించింది. రేషన్ బియ్యం యధేచ్చగా ఇతర దేశాలకు తరలిపోవడం వెనక మిల్లర్లు., బడ వ్యాపారులప్రమేయాన్ని నిర్ధారించడం ప్రధానంగా కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలు తమ దగ్గర వున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఆరుగురు IPS ల సహకారంతో నేషనల్ హైవే మీద రేషన్ బియ్యం యధేచ్చగా తరలిపోయిన విషయం ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామన్నారాయన. ఇప్పటికే కాకినాడు కలెక్టర్ ఆధ్వర్యంలో స్టెల్లా షిప్లో అణువణువూ తనిఖీ జరుగుతుండగా CID ఎంట్రీపై ఆసక్తీ నెలకొంది. ఒక్క సివిల్ సఫ్లైశాఖ 729 మందిపై కేసులు పెట్టింది. 102 వాహనాలను సీజ్ చేసింది. అక్రమార్కులపై పీడీ యాక్ట్ నమోదు చేయడమే కాకుండా… రౌడీ షీట్లు తెరుస్తామని సీరియస్ వార్నింగ్ ఇస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. బియ్యం దొంగల భరతం పట్టేందుకు ఏపీ సర్కార్ CID విచారణకు ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.. గతంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి రేషన్ బియ్యం దారి మళ్లించారని.. ఆరుగురు ఐపీఎస్‌లు సహకరించినట్టు ఆధారాలు ఉన్నాయని సర్కార్ చెబుతోంది.
పీఎల్‌జీఏ వారోత్సవాలు.. భద్రతా బలగాలు అలర్ట్..
తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఆందోళన కొనసాగుతుంది. గత రెండు రోజులుగా మావోయిస్టులు వర్సెస్ భద్రత బలగాల మధ్య కాల్పులతో హోరెత్తుతుంది. ఈ కాల్పుల్లో ఒక హెడ్ కానిస్టేబుల్ మృతి చెందగా.. నిన్న రాత్రి కూడా మావోయిస్టులకు పోలీసులకు మధ్య పామేడ్ ఏరియాలో కాల్పులు జరిగాయి. అయితే నష్టం వివరాలు ఇంత వరకు సమాచారంలేదు. మావోయిస్టుల కంచుకోట అబుజ్‌మర్ ఏరియాలో పదేపదే కాల్పులు కొనసాగుతున్నాయి. మొన్న నారాయణపూర్ జిల్లా రాయపూర్ ఏరియాలో మావోయిస్టులకి పోలీసులకి మధ్య కాల్పులు జరిగా ఒక కానిస్టేబుల్ మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా పామేడి ఏరియాలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. నారాయణపూర్ బీజాపూర్ ఏరియాలో గత రెండు రోజుల నుంచి పలుచోట్ల మావోయిస్టులకి భద్రతా బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పోర్టల్
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ ‘శబరిమల – పోలీస్ గైడ్’ పోర్టల్‌ను సిద్ధం చేసింది. ఈ పోర్టల్ ఆంగ్ల భాషలో అందుబాటులో ఉంటుంది. క్విక్ రెస్పాన్స్ (QR) కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా దీన్ని చూడవచ్చు. ఈ పోర్టల్‌లో ఇక్కడికి వచ్చే యాత్రికులకు అవసరమైన అన్ని ముఖ్యమైన సమాచారం పొందుపరిచారు. పోలీసు హెల్ప్‌లైన్ నంబర్లు, పోలీసు స్టేషన్‌ల ఫోన్ నంబర్లు, ఆరోగ్య సేవలు, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), అంబులెన్స్, అగ్నిమాపక సేవ, ఆహార భద్రత, దేవస్వోమ్ కార్యాలయ నంబర్లు కూడా పోర్టల్‌లో ఇవ్వబడ్డాయి.
హిందువులపై జరుగుతున్న దాడిలను ఖండించిన ముస్లిం నేతలు.. యూనస్‌కు లేఖ
బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. యూనస్ ప్రభుత్వ వాదనలు ఉన్నప్పటికీ, మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సుమన్‌గంజ్ జిల్లాలో హిందువుల ఇళ్లపై ఛాందసవాదుల గుంపు దాడి చేసింది. ఈ బుధవారం హిందువుల ఇళ్లపై గుంపు దాడులు చేసింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లో హిందూ యువకుడిపై దైవదూషణ ఆరోపణలు రావడంతో హింస జరిగింది. ఛాందసవాద మూక 100 మందికి పైగా హిందువుల ఇళ్లను ధ్వంసం చేసింది. ఇళ్లలోని ప్రార్థనా స్థలాలను కూడా వదిలిపెట్టలేదు. మీడియా నివేదిక ప్రకారం, ఇటీవల 200కు పైగా హిందూ కుటుంబాలు వలస వెళ్లాయి. ఆరోపణల నేపథ్యంలో, దైవదూషణ ఆరోపణలపై సుమన్‌గంజ్‌లోని మంగళర్‌గావ్‌కు చెందిన ఆకాష్ దాస్ (20)ని పోలీసులు అరెస్టు చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులను భారత దేశానికి చెందిన పలువురు ముస్లిం నేతలు తీవ్రంగా ఖండించారు. త్వరగా దాడులను ఆపాలని కోరుతూ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్‌కు గురువారం లేఖ రాశారు. దీనిపై సంతకాలు చేసిన వారిలో ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ ఎస్.వై.ఖురేషి, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, పారిశ్రామికవేత్త సయీద్ శేర్వాణీ తోపాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. మైనారిటీలపై వేధింపులను వారి ఇస్లాం వ్యతిరేక చర్యలు అని లేఖలో పేర్కొన్నారు. భారత జాతీయ పతాకాన్ని అవమానించే చర్యలను వెంటనే అడ్డుకోవాలని ముస్లింలకు చెందిన త్రిపుర గౌసియా సమితి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
నేడు ఆర్బీఐ ద్రవ్య సమీక్ష.. ఈసారి కూడా వడ్డీరేట్లు యథాతథం
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీకాలం డిసెంబర్ 10వ తేదీతో అయిపోయింది. మరోసారి ఆయనకు అవకాశం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. దీంతో చివరి ఎంపీసీ సమావేశంలోనైనా వడ్డీ రేట్లను తగ్గించి ఊరట కల్పిస్తారా లేదా అన్న సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అయితే, ప్రస్తుతం సీఆర్ఆర్ 4.5, రెపోరేటు 6.5 శాతంగా ఉన్నాయి. రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ భారీగా పడిపోవడానికి వీటిని తగ్గించకపోవడమే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ నేడు ఏం చేస్తారో వేచి చూడాలి. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రెండో త్రైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాన్ని ఈరోజు (డిసెంబర్ 6) ప్రకటించనుంది. అయితే, ఈసారి కూడా కీలక వడ్డీరేట్లను యథాతథంగానే ఉంచే ఛాన్స్ ఉంది. గత ఏడాది ఏప్రిల్ నుంచి రెపో రేటును గరిష్ఠ స్థాయిలోనే సెంట్రల్ బ్యాంక్ ఉంచుతుంది. ఈ క్రమంలో మరోసారి ఈ రేట్ల జోలికి వెళ్లకుండానే ద్రవ్య సమీక్షను ఆర్బీఐ ముగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు అటు బ్యాంకింగ్, ఇటు ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు. రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణాలు బాగా పెరగడమే దీనికి ప్రధాన కారణం.
నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు.. భారత్ సిద్ధంగా ఉండాలి: రవిశాస్త్రి
ఎన్నో ప్రతికూలతల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్.. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మెరిసి అద్భుత విజయం సాదించిన టీమిండియా.. ఇక రెండో టెస్టుకు సిద్ధమైంది. అయితే అడిలైడ్‌లో గత పర్యటన అనుభవం భారత జట్టుకు హెచ్చరికలు పంపుతోంది. అడిలైడ్ మైదానంలో గత పర్యటనలో ఆడిన టెస్టులో భారత్ 36 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేదు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్. అయితే అడిలైడ్‌లో డే/నైట్ టెస్టుకు సిద్ధమైన భారత్‌ను 2020 నాటి చేదు అనుభవం వెంటాడుతుందని తాను అనుకోవట్లేదని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఐసీసీ రివ్యూ తాజా ఎపిసోడ్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘2020లో అడిలైడ్‌లో భారత్ 36 పరుగులకే కుప్పకూలింది. ఆ సంఘటన ఇప్పుడు అదే మైదానంలో ఆడుతున్న భారత జట్టును వెంటాడుతుందని నేను అనుకోను. కానీ గులాబి బంతితో పరిస్థితులు వేగంగా మారిపోతాయి. ఈ విషయంలో మాత్రం రోహిత్ సేన సిద్ధంగా ఉండాలి. ఆరోజు బంతి దూసుకు రావడం.. బ్యాట్‌కు తాకి క్యాచ్ వెళ్లడం జరిగింది. ఒక సెషన్‌లో అంత వేగమైన పతనాన్ని నా కెరీర్‌లో ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుత సిరీస్‌లో ఒత్తిడి మొత్తం ఆస్ట్రేలియా పైనే ఉంది. అడిలైడ్‌లో రాణించి.. సిరీస్‌లో పట్టు బిగించే అవకాశం భారత్ ముందుంది’ అని తెలిపాడు.
అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న అజిత్, సూర్య
కోలీవుడ్ స్టార్ హీరోస్ అజిత్, సూర్య సినిమాల విషయంలో ఫ్యాన్స్ కన్ఫ్యుజన్, టెన్షన్‌తో బుర్రలు పాడు చేసుకుంటున్నారు. తల అప్ కమింగ్ మూవీ విదాముయర్చి వివాదంలో చిక్కుకోవడమే హర్డ్ కోర్ ఫ్యాన్స్‌కు ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉన్న విదాముయర్చి 1997లో వచ్చిన హాలీవుడ్ బ్రేక్ డౌన్‌కు రీమేక్ అని రెండిటిని పోలుస్తూ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ గా మారాయి ఇది కాస్త హాలీవుడ్ నిర్మాణ సంస్థ చెంతకు చేరింది.
విదాముయర్చి టీజర్‌లో కొన్ని సీన్స్ ‘బ్రేక్ డౌన్’కు రిలేటెగా ఉండటంతో సదరు నిర్మాణ సంస్థ కాపీ రైట్స్ ఉల్లంఘన కింద లైకా ప్రొడక్షన్స్‌కి 15 మిలియన్ డాలర్ల పరిహారం కోరినట్లు కోలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. దీంతో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో రాదోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అజిత్ ఫ్యాన్స్. మరోవైపు సూర్య డై హార్ట్ ఫ్యాన్స్‌ది మరో ఆందోళన. కంగువా రిజల్ట్‌తో సూర్యనే కాదు ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా డీలా పడ్డారు. దీంతో కార్తీక్ సుబ్బరాజుతో సూర్య చేస్తున్న సినిమాపై ఫాన్స్ గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ సినిమాతో పాటు RJ బాలాజీతో ఓ సినిమా చేస్తున్నాడు. సూర్య 45గా తెరకెక్కుతున్న ఈ మూవీపైనే ఫ్యాన్స్ దిగులంతా. సూర్య ఓ ప్లాప్ మూవీని రీమేక్ చేస్తున్నాడట. ఆర్జే బాలాజీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తోన్న సూర్య 45 రవితేజ ప్లాప్ మూవీ వీర స్టోరీకి దగ్గరగా ఉందని లేటెస్ట్ బజ్. ఈ మేటర్ లీక్ కావడంతో ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. ప్లాప్ మూవీ రీమేక్ ఏంటన్నా అంటున్నారు.
ప్రభాస్, బన్నీ సరసన ఛాన్స్ వస్తే రిజెక్ట్ చూపే దమ్ము ఆ హీరోయిన్ కు ఉందా ?
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో వారి సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ఇలాంటి స్టార్ల సరసన నటించే అవకాశం వస్తే కాదనే దమ్ము ధైర్యం ఏ హీరోయిన్ కి అయినా ఉందా? ప్రభాస్, బన్నీ ప్రస్తుతం దేశంలోని అతి పెద్ద పాన్ ఇండియన్ స్టార్లుగా తమ టాలెంట్ నిరూపించుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ టాలీవుడ్ ఆఫర్లను తిరస్కరిస్తోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. తెలుగులో పలువురు స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తనను సంప్రదించినా కానీ చేయనని చెబుతున్నట్లు ఈ పుకార్ల సారాంశం. తెలుగు పరిశ్రమను అవాయిడ్ చేసేందుకు రెమ్యునరేషన్ భారీగా పెంచేసి తనను సంప్రదించే దర్శక నిర్మాతలకు షాక్ ఇస్తుందట. ఇదంతా ఎవరి గురించి అంటే.. సాహో ఫేం శ్రద్ధా కపూర్. ఈ అమ్మడు ఇటీవలే స్త్రీ 2లో నటించి భారీ హిట్ అందుకుంది. అందువల్ల బాలీవుడ్ లోనే వరుస అవకాశాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అదే సమయంలో టాలీవుడ్ సహా పర భాషల నుంచి భారీగా అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి `సాహో` చిత్రంలో నటించినప్పటికి శ్రద్ధాకు అంత సీన్ లేదు. అప్పట్లో శ్రద్ధా కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం `సాహో` మాత్రమే. సాహో ఆఫర్ కారణంగానే శ్రద్ధాకు పారితోషికం అమాంతం పెరిగింది. ఆ తర్వాత కూడా కొన్ని బ్లాక్ బస్టర్లలో నటించిన శ్రద్ధా అమాంతం రెమ్యునరేషన్ పెంచేసింది. ఇటీవలే విడుదలైన హారర్ థ్రిల్లర్ `స్త్రీ 2`తో మరో బంపర్ హిట్ అందుకున్న శ్రద్ధా ఇప్పుడు రెమ్యునరేషన్ విషయంలో చుక్కలు చూపిస్తోందట. అయితే టాలీవుడ్ నుంచి ప్రభాస్- బన్నీ- ఎన్టీఆర్- చరణ్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఆఫర్లు ఇస్తే ఈ తరహాలో జూమ్ చేయదని కూడా భావించాల్సి ఉంటుంది.
రాజాసాబ్ రిలీజ్ డేట్ పై అనుమానం..?
రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సినిమాలు టాలీవుడ్ లో మారె ఇతర స్టార్ హీరో చేయడం లేదు. ఇప్పటికే ఈ ఏడాది కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్ అనుదుకున్న డార్లింగ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ కూడా ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి హను రాఘవపూడి సినిమా కు పూర్తీ స్థాయిలో డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడు అని టాక్. రాజాసాబ్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకుని షూటింగ్ కూడా ఎక్కడా విరామం లేకుండా చేస్తున్నాడు దర్శకుడు మారుతి. కానీ రాజా సాబ్ గురించి లేటెస్ట్ గా ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికి సగానికి పైగా షూట్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందట. వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా అనుకున్నటైమ్ ఏప్రిల్ లో విడుదల వాయిదా పడుతుందనే చర్చ నడస్తోంది. షూటింగ్ త్వరగానే అవుతుందని కానీ ఈ సినిమాలో మేజర్ భాగం VFX వర్క్ ఉంటుందని అది రిలీజ్ నాటికి ఫినిష్ అవదని సమాచారం. ఇటీవల ప్రభాస్ బర్త్ డే నాడు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు విశేష