కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం పట్టుబడిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది.. అయితే, మీడియా చిట్‌చాట్‌లో ఈ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. కాకినాడ పోర్టు వద్ద ఒక ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను ఏర్పాటు చేస్తామన్న ఆయన.. మూడు షిఫ్టుల్లో భద్రత పెంచుతాం.. ట్రాన్స్పోర్ట్ మెకానిజంలో మార్పులు చేపడతాం అన్నారు.. ఐపీసీ ఇన్వాల్వ్ చేసేలా రవాణా వ్యవస్ధ కఠినతరం చేస్తామని వెల్లడించారు..
మద్యం కమిషన్ పెంచకపోతే లైసెన్స్ ఫీజు కట్టలేం అంటున్నారు మద్యం షాపుల యజమానులు.. కడపలో సమావేశమైన వైన్స్ షాపులు, బార్ల యజమానులు మద్యం అమ్మకాలపై కమిషన్‌పై చర్చించారు.. మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం కమిషన్ ఇస్తే తప్ప షాపులు నడపలేమంటూ స్పష్టం చేశారు.. రెండు నెలలకు కట్టాల్సిన ఫీజులు ముందుగానే కట్టించుకుంటున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు..
మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.. ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడుతూ తొలిసారి దొరికితే ఏకంగా రూ.5 లక్షలు జరిమానా విధించనున్నారు.. అయినా తీరు మారకుండారెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు చేయనుంది ప్రభుత్వం..
పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి, ఆర్జీవీ ఈవేళ రాజకీయాలు వదిలేస్తే.. చట్టం వదిలేస్తుందా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సొంత చెల్లినే బయటకు నెట్టేసిన వాడు.. ప్రజలకు ఏమీ చేస్తాడు..? ప్రజలకు ఏమీ చెబుతానని జనంలోకి వస్తాడు..? అంటూ నిలదీశారు.. ఇక, మాజీ సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు మాజీ బుచ్చయ్య చౌదరి. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో భూకబ్జా దారులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు..
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు భేటీ అయ్యారు. ఏపీ ఐఐసీ కార్యాలయంలో ఏపీ, తెలంగాణ అధికారుల కమిటీ సమావేశం అయ్యింది.. ఏపీ ఐఐసీ కార్యాలయానికి ఒకే కారులో వచ్చారు ఏపీ సీఎస్ నీరభ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారి.. ఆ తర్వాత సమావేశం ప్రారంభమైంది.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరుగుతోంది..
రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని.. సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదన్నారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రైతుభరోసాపై కేబినెట్ సబ్‌కమిటీ వేశామని.. మా ప్రభుత్వం రైతు భరోసా కొనసాగిస్తుందని తెలిపారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రైతు…
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి జత్వానీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా తాతా, విశాల్ గున్నిలకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ అఫిడవిట్ దాఖలు చుఏసింది.. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు కాంతిరాణా తాతా, విశాల్ గున్ని, పోలీసులు, న్యాయవాది. .. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అఫిడవిట్లో సీఐడీ పేర్కొంది..