Nandyal Crime: విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నేహితులు అందరూ స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత పెద్ద కోనేరులో ఈత కొడుతూ, నీటి లోపల ఎవరు ఎక్కువ సేపు ఉంటే వారు విజేత అని పందెం వేసుకున్నారు.
Read Also: CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు.. సీఎం సమీక్ష..
అయితే, మిత్రులందరికీ మధ్య వేసున్న పందెంలో నీటిలో మునిగిన యువకుడు సురేంద్ర కోనేరు అడుగు భాగంలో ఊపి రాడక పోవటంతో ప్రాణం కోల్పోయి విగత జీవిగా మారాడు, ఇక, సురేంద్ర మృత దేహాన్ని కోనేరు నుండి వెలికి తీసి బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సురేంద్ర యాగంటిలో మృతి చెందాడనే సమాచారం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన బనగానపల్లెకు వైద్యశాలకు చేరుకున్నారు.. అయితే, మృతుడి తండ్రి నాగరాజు తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేకనే, కక్షపూరిత కుట్రతోనే మిత్రులందరు కలిసి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. సురేంద్ర యాగంటి పెద్ద కోనేరు నీటిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి, విహార యాత్రకు వచ్చిన మిత్ర బృందంలో ఐదు మంది యువకులు రాత్రికి రాత్రి పరారై పోవటం తల్లిదండ్రులు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందంటున్నారు.. మరో నలుగురు యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..