CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు.. సీఎం సమీక్ష..
- పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు..
- సమీక్ష నిర్వహించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు..
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న 26 జిల్లాల కలెక్టర్లు..
- హాజరైన మంత్రులు మనోహర్, అచ్చెన్నాయుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 26 జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు కూడా హాజరయ్యారు.. కాగా, ఏపీ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు ఏపీ సర్కార్ సాంకేతికను వినియోగిస్తుంది. అలాగే ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. అయితే, గత ప్రభుత్వ హయాంలో రైతుల దగ్గర ధాన్యం కొని, నెలల తరబడి డబ్బులు చెల్లించలేదన్న విమర్శల నేపథ్యంలో.. ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం.. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై దృష్టిసారించింది..
Read Also: CM Revanth Reddy: కేసీఆర్… అసెంబ్లీ సమావేశాలకు రండి, సలహాలు ఇవ్వండి..
Also Read
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో తల్లి సంచలన వాదనలు
- Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Tirumala Srivari Brahmotsavam 2026: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఏ రోజు ఏ వాహన సేవ అంటే?
ఇక, ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ధాన్యం విక్రయించుకొనే విధానాన్ని ప్రభుత్వం సులభతరం చేస్తూ కీలక మార్పులు తీసుకువచ్చింది. రైతులు తమ పంటను జిల్లాలో ఎక్కడైనా, ఏ రైస్ మిల్లుకైనా అమ్ముకొనే విధానాన్ని అమలుచేస్తుంది. అదే విధంగా వాట్సాప్ ద్వారా ధాన్యం విక్రయాలు చేసేందుకు సులభ విధానం అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు.. ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షా 61 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక, చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు మంత్రి మనోహర్.. సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.. ఈ రోజు రాత్రికి సీఎం విశాఖపట్నం వెళ్లనున్న విషయం విదితమే..
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?