కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు .
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ వెళ్లిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు.. ఓవైపు సీఎం చంద్రబాబుతో కలిసి వివిధ సంస్థల భేటీల్లో పాల్గొంటున్న ఆయన.. మరోవైపు.. అవకాశం దొరికొనప్పుడు ఇతర సంస్థలతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు..
ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాల టికెట్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు.. దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల చేయబోతున్నారు.. ఇవాళ ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక దర్శన టిక్కెట్లు పెట్టబోతున్నారు.. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.
రాజమండ్రి సమీపంలో కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో వైజాగ్ కు చెందిన యువతి మృతి చెందగా... 20 మంది వరకూ గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు గత రాత్రి బయలుదేరిన కావేరి ట్రావెల్ బస్సు అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి గామన్ వంతెన రహదారిపై బోల్తా పడింది.
అనంతపురం శివారులో రాజహంస విల్లాస్లో భారీ చోరీ జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శివారెడ్డి ఇంట్లో రూ. 3.5 కోట్ల విలువైన బంగారు నగలను దుండగులు అపహరించారు. కూతురు వివాహం కోసం దాచి వుంచిన నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో నుంచి దాదాపు రూ. 20 లక్షలు తీసుకు వెళ్లారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ లీడర్. అంతకు మించి పొలిటికల్ మొండి ఘటం అని చెప్పుకుంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లంతా. పట్టు పడితే ఎదురుగా ఎవరున్నా వదలరని అంటారు. గతంలో మాజీ సీఎం జగన్ ఉద్దేశించి ఆయన అన్న మాటలు చాలా దూరం వెళ్ళాయి. జగన్ అధికారంలోకి వచ్చాక ఆ వ్యాఖ్యల ఫలితాన్ని జేసీ అనుభవించారని అంటారు పొలిటికల్ పండిట్స్. అది వేరే స్టోరీ. అంతటి మొండి ఘటాన్ని కూడా...…
అనుకుంటాంగానీ..., రాజకీయాల్లోనే సెంటిమెంట్లు ఎక్కువగా పండుతుంటాయి. ఒక్కసారి నెగెటివిటీ డవలప్ అయితే చాలు... ఎంత ఉన్నత పదవి అయినా... తీసుకోవడానికి భయపడుతుంటారు నాయకులు. సరిగ్గా అటువంటిదే ఇప్పుడు వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోందట. ఆ సీటే అత్యంత కీలకమైన విశాఖ జిల్లా అధ్యక్షపదవి. ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో పార్టీ మీద అధ్యక్షుడిదే ఆజమాయిషీ. అధికారంలో వుంటే ఎమ్మెల్యేలతో సమానంగా... ఆ మాటకొస్తే... ఇంకాస్త ఎక్కువే గౌరవం లభిస్తుంది.