YS Jagan: వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం.. జగన్ మాస్ వార్నింగ్!
- కాపు కులంలో అంబటి రాంబాబు టైగర్
- వచ్చేది మా ప్రభుత్వమే, వడ్డీతో సహా చెల్లిస్తాం
- విషపూరిత విత్తనాలు నాటడం ఆపండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాపు కులంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు టైగర్ అని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు అంబటిని దారుణంగా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది తమ ప్రభుత్వమే అని.. అన్నింటికి వడ్డీతో సహా చెల్లిస్తాం అని అధికార పార్టీకి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడైనా బుద్ధి, జ్ఞానం తెచ్చుకోండని.. విషపూరిత విత్తనాలు నాటడం ఆపండని వైఎస్ జగన్ సూచనలు చేశారు. ఈరోజు జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి ఇంటికి వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
Also Read: YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘అంబటి రాంబాబును ఎందుకు అరెస్టు చేశారు?. మరి రాంబాబు ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యేపై చర్యలేవి?. తూతూమంత్రంగా అరెస్టు చేసి.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. ఇది జంగల్ రాజ్యం కాదా?. జోగి రమేష్ ఇంటిపై పోలీసుల సమక్షంలోనే పెట్రోల్ బాంబులేసి తగులపెట్టారు. మా వాళ్ళపై దాడులు చేసి.. వాళ్ళపైనే రివర్స్ కేసులు పెట్టారు. సీఎం చంద్రబాబు పాపాలకు అడ్డుఅదుపూ లేకుండా పోయింది. చంద్రబాబు చేసిన తప్పుకి దేవుడే సీబీఐ చేత మొట్టికాయలు వేయించాడు. కాపు కులంలో అంబటి ఒక టైగర్. గొప్పగా బ్రతికినాడు.. విలువలతో కూడిన వ్యక్తిత్వం కలవాడు. సీనియర్ లీడర్.. మాజీ మంత్రి. స్టేషన్లో అలాంటి వ్యక్తిని కొడతారా?. ఎల్లకాలం ఇలానే అన్యాయం చేస్తే.. మీ ప్రభుత్వమే ఉండదు గుర్తు పెట్టుకోండి. మూడేళ్ళల్లో మా ప్రభుత్వం వస్తుంది.. జాగ్రత్త. వడ్డీతో సహా చెల్లిస్తాం.. తప్పు చేసిన వాళ్ళని న్యాయ పరంగా బొక్కలో పెట్టి బుద్ది చెప్తాం. దెబ్బ తిన్న మా వాళ్ళు రేపు ఊరుకుంటారా?. మేము వచ్చాక మా వాళ్ళు ఇలానే స్పందిస్తే మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి. ఇలాంటి ఘటనలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు కూడా ఇస్తాం. కేంద్ర స్థాయిలో వీళ్ళ పాపాలు తీసుకుని వెళ్తాం. సీబీఐ రిపోర్ట్ ఇచ్చాక మళ్లీ కమిటీలు ఏంటి?. చేసిన తప్పు బయట పడేసరికి కమిటీ అంటున్నాడు’ అని జగన్ రెడ్డి ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!