H.D. Kumaraswamy: విశాఖ ఉక్కుకు మళ్లీ జీవం పోస్తాం.. ప్రైవేటీకరణ జరగదు
- విశాఖ ఉక్కుకు మళ్లీ జీవం పోస్తాం- హెచ్‌డీ కుమార స్వామి
- ఉక్కుమంత్రిగా నాకు ప్రధాని మోడీ గొప్ప అవకాశం ఇచ్చారు- కేంద్ర మంత్రి
- స్టీల్ అభివృద్ధి కోసం రాష్ట్ర నేతలు నన్ను చాలాసార్లు కలిశారు- కుమార స్వామి
- 2030లోపు 300 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖలో స్టీల్ ప్లాంట్ పర్యటనలో కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమార స్వామి బిజీబిజీగా గడిపారు. ఆయనతో పాటు.. ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా.. ఆర్ఐఎన్ఎల్ (RINL) డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్లాంట్ వాస్తవ పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్టీల్ ఎగ్జిక్యూటివ్, ఎస్.ఎస్.టీ. అసోసియేషన్, కార్మిక సంఘాలతో కూడా సమావేశం అయ్యారు. జీతాల బకాయిలు, స్టీల్ ప్లాంట్ ఇబ్బందులు పరిష్కరించాలని కేంద్రమంత్రి కుమార స్వామిని కార్మిక సంఘాలు కోరారు.
ఈ సందర్భంగా ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ.. ప్లాంట్ ఇబ్బందులు, సమస్యలపై తనకు అవగాహన ఉందని అన్నారు. జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారని తెలుసు.. ఇంకో మూడు నెలలపాటు జీతాలకు ఇబ్బంది ఉంటుందని తెలిపారు. కార్మికులు సహకరించాలి.. ప్లాంట్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. భారీ ఆర్థిక ప్యాకేజ్ తర్వాత ప్లాంట్ సమర్ధవంతంగా నిర్వహణ కోసం హెచ్‌డీ కుమార్ స్వామి పర్యటన జరిగిందన్నారు. భారీ ఆర్థిక ప్యాకేజ్ సాధించడంలో కుమార్ స్వామి కృషి చాలా కీలకమైందని తెలిపారు. ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా నిరంతరం ప్రయత్నం చేశాం.. సమిష్టి కృషి కారణంగా ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించారని అన్నారు. 2030 నాటికి దేశీయ స్టీల్ ఉత్పత్తి 300 మిలియన్ టన్నులకు తీసుకు వెళ్లాలనేది కేంద్రం లక్ష్యమని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. అందులో స్టీల్ ప్లాంట్ భాగస్వామ్యం కానుంది.. ప్రధానిని, అధికారులను ఒప్పించడంలో కుమారస్వామి కృషి చాలా ప్రధానమని పేర్కొన్నారు. కార్మికులకు భరోసా, ప్యాకేజ్ తర్వాత సమర్ధవంతంగా ముందుకు తీసుకుని వెళ్లడం కోసం ఈ పర్యటన అని తెలిపారు.
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
Sweden: ఖురాన్ తగలబెట్టిన ఇరాకీ శరణార్థి సల్వాన్ మోమికా హత్య
అనంతరం ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమార్ స్వామి మాట్లాడుతూ.. ప్రధాని పెట్టిన వికసిత భారత్ విజన్ లక్ష్యం సాధన దిశగా స్టీల్ మంత్రిత్వ శాఖ పని చేస్తోందని తెలిపారు. 300 మిలియన్ టన్నుల లక్ష్యంగా చాలా సవాళ్లు ఎదురవుతున్నాయి.. RINLది ఘనమైన చరిత్ర.. పోరాటాలు, ప్రాణార్పణ కారణంగా ఏర్పాటు సాధ్యం అయ్యిందని తెలిసిందని కుమారస్వామి అన్నారు. 3 మిలియన్ టన్స్ ఉత్పత్తి సామర్ధ్యంతో పని చేసినప్పుడు సమర్ధవంతంగా నడిచింది.. 2013లో RINL నవరత్న గుర్తింపు లభించిందని తెలిపారు. మోడీ ఫికేషన్, ఎక్స్ ప్యాన్షన్ తర్వాత ఆర్థిక నష్టాలు మొదలయ్యాయన్నారు. విస్తరణ కోసం బ్యాంకుల నుంచి చేసిన రుణాలు భారంగా మారాయి.. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభించిన తర్వాత ఉత్పత్తి మందగించిందని పేర్కొ్న్నారు.
ప్రస్తుతం 35 వేల కోట్లు అప్పులు స్టీల్ ప్లాంట్‌కు ఉన్నాయి.. RINLను జూలైలో విజిట్ చేసినప్పుడు ప్రయివేటీకరణ జరగదు రివైవ్ చేస్తామని ఖచ్చితంగా చెప్పాను.. గత ఆరు నెలల కాలంలో సీఎం చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు ఈ సమస్య పరిష్కారం కోసం ఒత్తిడి చేస్తూ వచ్చారని హెచ్‌డీ కుమార్ స్వామి తెలిపారు.
మా అభ్యర్థనలను ప్రధాని మోదీ అంగీకరించారు.. మొదటి దశలో NPA నుంచి బయట పడేందుకు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిధుల విడుదల చేశారని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమార్ స్వామి చెప్పారు. NPA సమస్యను పరిష్కరించిన తర్వాత రెండు ఫార్మేసులు సమర్ధవంతంగా నిర్వహించడంలో కార్మికులు విజయవంతం అయ్యారన్నారు. ప్రస్తుతం స్టీల్ ప్లాంటు సమర్ధవంతంగా పనిచేస్తోంది.. కార్మికులకు ఉన్న ఇబ్బందులు తెలుసు.. ప్యాకేజ్ సమర్ధవంతంగా వినియోగంపై రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ప్లాంట్ విజిట్ చేశానన్నారు. వైజాగ్ స్టీల్ సమర్ధవంతంగా నిర్వహించి నంబర్ వన్ ప్లాంట్ గా మారుస్తామని చెప్పారు. కార్మికుల సమస్యలను మూడు నెలలలో పరిష్కరిస్తాం.. సహకరించమని కోరాను.. అందుకు యూనియన్లు అంగీకరించాయని పేర్కొన్నారు. 15 రోజుల్లో వర్కింగ్ ప్లాన్ ప్రకటిస్తాం.. మూడో బ్లాస్ట్ ఫర్నేస్ జూన్, జూలై నాటికి ప్రారంభిస్తామని చెప్పారు. 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేసి ఈ ఏడాది చివరి నాటికి బ్రేక్ ఈవెన్ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. విశాఖ ఉక్కును పటిష్టం చేయడం తమ ముందు ఉన్న ప్రధాన లక్ష్యమని కుమార్ స్వామి తెలిపారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!