Forest and Revenue Officials Joint Committee: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలు..! అటవీ, రెవెన్యూ శాఖల విచారణ ప్రారంభం..
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై విచారణ ప్రారంభం..
- రంగంలోకి అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ..
- 295, 296 సర్వే నెంబర్లలోని భూముల పాత దస్త్రాల పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forest and Revenue Officials Joint Committee: చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై ఏర్పాటు చేసిన అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో సంయుక్త కమిటీ విచారణ ప్రారంభించింది.. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించారని భావిస్తున్న 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు. పులిచెర్ల తహశీల్దార్‌ను చిత్తూరు కలెక్టరేట్‌కు పిలిపించి మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాలను తెప్పించుకున్నారు కలెక్టర్ సుమిత్ కూమార్. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్‌ల్యాండ్ అడంగల్‌లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌కు నివేదిక సమర్పించనట్లు సమాచారం. .మంగళంపేట గ్రామపటం ప్రకారం చూస్తే ఆ రెండు సర్వే నంబర్లలోని భూమి దట్టమైన రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. వాస్తవాలు నిగ్గు తేలాలంటే అటవీశాఖ అధికారులతో కలిసి లోతైన విచారణ జరపాలని పట్టాదారుల దగ్గరున్న పత్రాల్ని పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీలోని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
Read Also: Ponnam Prabhakar: బడ్జెట్‌ను అడ్డుకోవడం అంటే.. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నట్టే!
Also Read
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!