తెలుగుదేశం పార్టీకి దశ, దిశ నారా లోకేష్ మాత్రమే.. నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే సీఎం అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న.. విజయవాడలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ కార్యలయంలో నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.. భారీ కేక్ కట్ చేశారు వెంకన్న, టీడీపీ కార్యకర్తలు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు తరువాత పార్టీకి దశ దిశ లోకేష్ మాత్రమే అన్నారు. చంద్రబాబు పాదయాత్రకు వచ్చిన ఆదరణ మళ్లీ…
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కోస్టల్ ఆంధ్ర పవర్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించిన భూములను జిల్లా రెవెన్యూ అధికారులతో కలిసి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ అంబానీ పరిశీలించారు.
2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంతో పాటు నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామన్నారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న నూతన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు మంత్రికి వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు... రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు..
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు లోకేష్.. బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్‌కి శుభాకాంక్షలు తెలిపుతున్నారు..
ఇన్నాళ్ళు స్తబ్దుగా మారిన పార్టీ వాతావరణం తిరిగి సెట్ అవుతోందని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఇటీవలి కాలంలో జిల్లా సమీక్షా సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలిచ్చారట జగన్. సీనియర్స్ అంతా ముందుకు వచ్చి ప్రభుత్వ వైఫల్యాలపై గొంతు విప్పాలన్న ఆదేశాలు మెల్లిగా అమలవుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు.
ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్లో నకిలీ జడ్జిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని వద్ద సకిలీ జడ్జి ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వివిధ రకాల చిరునామాలతో అతని దగ్గర కార్డులు ఉండడాన్ని గుర్తించారు పోలీసులు..
కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లా లూసియర్ బ్రాడర్డ్ తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వేడేర్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కీలక రంగాల్లో స్విస్ కంపెనీలను ఆహ్వానించండానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు .