Vizag: శెభాష్.. 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన విశాఖ సిటీ పోలీస్
- 24 గంటల్లో మిస్సింగ్ కేసును చేధించిన పోలీసులు. తప్పిపోయిన బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన విశాఖ పోలీసులు
- కూతురు మొబైల్ ఎక్కువగా చూస్తుందని మందలించిన తండ్రి
- చెప్పా పెట్టకుండా లాడ్జి నుండి బయటకు వెళ్ళిపోయిన బాలిక
- వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
- గాలింపు చర్యలు చేపట్టి బాలిక ఆచూకీ కనుక్కున్న వన్ టౌన్ పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తప్పిపోయిన కుటుంబ సభ్యులు, మహిళలు, బాలికలు, యువతల కేసుల్లో విశాఖ పోలీసులు పట్టుబట్టి కేసును చేధిస్తున్నారు. తాజాగా.. మరో మిస్సింగ్ కేసును విశాఖ పోలీసులు సాల్యూ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన ఓ బాలిక మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించి తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖ సీపీ శంకభ్రత బగ్చీ పర్యవేక్షణలో వన్ టౌన్ పోలీసులు క్షణాల్లో స్పందించిన తీరును బాలిక తల్లిదండ్రులు కొనియాడారు.
Read Also: Swati Maliwal: హీటెక్కిన ఢిల్లీ పాలిటిక్స్.. కేజ్రీవాల్ ఇంటి ముందు చెత్త వేసి స్వాతి మాలివాల్ నిరసన
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
కాగా.. కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ కుటుంబం విహారయాత్ర కోసమని విశాఖ వచ్చారు. హార్బర్ వ్యూ ల్యాడ్జీలో బసకు దిగారు. అయితే.. ఆ సమయంలో సదరు బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందంటూ తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో.. కోపంతో లాడ్జీ నుంచి బయటకు వెళ్లింది. ఈ క్రమంలో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు సీపీ బగ్చీకి వాట్సాప్ ద్వారా సమాచారం అందించారు. వెంటన అప్రమత్తమైన పోలీసులు.. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. సొంత కుటుంబ సభ్యుల్లా భావించి బాలిక తల్లిదండ్రులకు పోలీసులు వసతి కల్పించి, ఆహారం పెట్టించారు. అయితే.. 24 గంటల్లోపే బాలిక ఆచూకీ కనిపెట్టి వన్ టౌన్ పోలీసులు క్షేమంగా ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో బాధిత తల్లిదండ్రులు విశాఖ సిటీ పోలీసుల సేవలను అభినందించారు. సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజావార్తలు
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!