DGP Dwaraka Tirumala Rao: సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నా.. ఆ ఒక్కటి తప్ప అన్ని కంట్రోల్‌లో ఉన్నాయి
- తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను..
- ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను..
- 35 ఏళ్లుగా సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది..
- సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను-ద్వారకా తిరుమల రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Dwaraka Tirumala Rao: తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ద్వారకా తిరుమల రావు.. ప్రస్తుతం డీజీపీగా ఉన్న సీహెచ్ ద్వారకా తిరుమల రావు.. రేపు అనగా.. జనవరి 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు.. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇప్పటి వరకు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఆయన విధులు నిర్వహించారు. ఇక, ఈ రోజు మీడియాతో మాట్లాడిన డీజీపీ ద్వారక తిరుమల రావు.. ఏడు నెలలుగా డీజీపీగా పని చేస్తున్నాను.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి ఉంది.. సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నాను అన్నారు.. ఏపీలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి.. సైబర్ క్రైమ్ తప్ప మిగతా వాటిలో నిందితులను గుర్తిస్తున్నాం.. సైబర్ క్రైమ్ తప్ప అన్నీ కంట్రోల్ లో ఉన్నాయని స్పష్టం చేశారు..
Read Also: Aravind Kejriwal : ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల సంఘం నోటీసులు
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
వరదల సమయంలో కూడా పోలిసులు మెరుగైన సేవలు అందించారని అభినందించారు ద్వారరకా తిరుమలరావు.. టెక్నాలజీని అంది పుచ్చుకుని ముందుకు వెళ్తున్నాం.. నేరాల రేటు తగ్గింది.. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు 9.5 శాతం తగ్గాయన్నారు.. రోడ్డు సేఫ్టీ పై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి.. సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఏర్పాటు చేస్తున్నాం.. ఇప్పటి వరకు 25 వేల కెమెరాలు ఏర్పాటు చేశాం.. మార్చి 31వ తేదీ నాటికి లక్ష కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు.. డ్రోన్స్ ను కూడా దాతల సాయంతో అన్ని చోట్లా అందుబాటులోకి తెచ్చే యత్నం చేస్తున్నాం అన్నారు.. ఇక, ఏపీ, తెలంగాణలో ఉన్న ఫింగర్ ప్రింట్ వ్యవస్థ ముందుందని ఈ సందర్భంగా వెల్లడించారు డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమల రావు..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!