CM Chandrababu: అడవీ మార్గం గుండా శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలిగించవద్దు అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ సీఎస్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అడవీ ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.
YCP Party: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల నోటీసులకు కార్యాలయ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ భద్రతపై పలు అనుమానాలున్నాయి.
Minister Kandula Durgesh: ఏపీ సచివాలయంలోని తన పేషీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం శాఖ ఎండీ ఆమ్రపాలి పాల్గొన్నారు.
సండే వచ్చిందంటే చాలు చికెన్ ప్రియులకు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కొందరైతే ప్రతిరోజు తినడానికి కూడా వెనకాడరు. చికెన్ తో వెరైటీ రెసిపీలు చేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కొండెక్కిన చికెన్ ధరలు నేల చూపుస్తున్నాయి. ఉన్నట్టుండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్ కిలో రూ. 30 కే వచ్చేస్తోంది. ఇది తెలిసిన చికెన్ లవర్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అయితే చికెన్ ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ ప్రభావం.…
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్లు కట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.. ఇప్పటికే శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో భవన నిర్మాణాలు జరిగాయి.. ఇక, అన్ని జిల్లాల్లో బీసీ భవన్లు కట్టాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి..
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. వీఐపీల భద్రత కోసం 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొనుగోలుకు సిద్ధమైంది.. దీనిపై ఆదేశాలు జారీ చేసింది హోంశాఖ.. 10 టయోటా ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ఫ్రూఫ్‌గా మార్చాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..
గిరిజన హక్కులకు కట్టుబడి ఉన్నామని.. 1/70 చట్టాన్ని రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు.. గిరిజనుల అస్తిత్వం కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడు కోవడమే.. ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో నంబర్ 3 తెచ్చి గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగాలు, గిరిజనులకు ఇచ్చేలా చేశాం అన్నారు సీఎం చంద్రబాబు..
కోళ్లలో వేగంగా వ్యాప్తిస్తోన్న వైరస్ పట్ల రాష్ట్రాలను అలర్ట్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.. వైరస్ పట్ల అప్రమత్తంగాఉండాలంటూ రాష్ట్రాలకు సూచించింది.. దీంతో.. అలర్ట్ అయిన తెలంగాణ పశు సంవర్ధక శాఖ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.. టీజీ పశు సంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి గోష్.. జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు..