APPSC on Group-2 Mains: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంటుందా? లేదా? అనే గందరగోళ పరిస్థితిలో ఉన్న అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. రేపు గ్రూప్- 2 ఉద్యోగాల నియామకం కోసం మెయిన్స్ పరీక్ష యథాతథంగా ఉంటుందని స్పష్టం చేసింది ఏపీపీఎస్సీ.. రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుందని.. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది.. ఇక, అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.. రేపు జరగనున్న ఏపీపీఎస్సీ గ్రూపు-2 మెయిన్స్ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఏపీపీఎస్సీ చెప్పింది.. రాష్ట్రవ్యాప్తంగా 175 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.. మెయిన్స్ పరీక్ష 92,250 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.. ఇక, పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు ఉంటాయని పేర్కొన్నారు.. పరీక్షలు సమర్థంగా నిర్వహించేందుకు జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు.. అయితే, సోషల్ మీడియాలో ఎవరైనా గ్రూప్-2 పరీక్షలపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు..
Read Also: Group 2 Candidates Protest: రేపే ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష.. రోడ్డెక్కిన అభ్యర్థులు..
కాగా, గ్రూప్- 2 మెయిన్స్ పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి లేఖ రాసింది.. రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి.. దీంతో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి లేఖ రాసింది.. ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్‌పై విచారణ సాగుతోంది.. వచ్చే నెల 11వ తేదీన మరో మారు విచారణ జరగనుంది.. కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.. ఒక వైపు గ్రూప్- 2 అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.. గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలను గుర్తించి ఏపీపీఎస్సీకి లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఏపీపీఎస్సీ దీనిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో.. అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. చివరకు, గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలన్న ప్రభుత్వ లేఖకు ఏపీపీఎస్సీ కార్యదర్శి తిరిగి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది.